’మోడీవి మాటలేకాని…చేతలు కావు’ : సీఎం చంద్రబాబు

  • Published By: veegamteam ,Published On : February 24, 2019 / 08:38 AM IST
’మోడీవి మాటలేకాని…చేతలు కావు’ : సీఎం చంద్రబాబు

Updated On : February 24, 2019 / 8:38 AM IST

అమరావతి : కేంద్రం ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం మనపై సీబీఐ దాడులు చేయిస్తోందన్నారు. దేశంలోని అవినీతిపరులను కాపాడే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మోడీవి మాటలేకాని…చేతలు కావు అని ఏద్దేవా చేశారు. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. విభజన హామీలు అమలు చేయలేదని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ హామీ అమలు కాలేదని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇంకా రాలేదని పేర్కొన్నారు. కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిశోర్ చంద్రదేవ్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. కిశోర్ చంద్రదేవ్ తోపాటు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు.

అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. బాక్సైట్ ప్రైవేటీకరణ చేసింది వైస్సే అని పేర్కొన్నారు. కేసీఆర్, జగన్, మోడీ కలిసి ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని..అది మంచి పద్ధతి కాదని హితవుపలికారు. అభివృద్ధిలో పోటీ పడాలని వారికి సవాల్ విసిరారు. ’మీ ఆటలు నా దగ్గర సాగవు’ అని హెచ్చరించారు. ఓ అవినీతి పేపర్ ను రౌడీలు మాత్రమే చదువుతారని విమర్శించారు. ఆ పత్రికను బాయ్ కాట్ చేయాలన్నారు. జగన్ కుప్పి గంతులు తన దగ్గర చెల్లవన్నారు. 

అరకు కాఫీని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలని.. లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయన్నారు. పసుపు-కుంకుమ పథకం కింద 95 లక్షల మంది మహిళలకు రూ.9 వేల చొప్పున ఇచ్చామని తెలిపారు. అరకు పార్లమెంట్ లో నూటికి నూరు శాతం తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.