మళ్లీ గెలిపించాలి లేదంటే అరాచకమే : చంద్రబాబు హెచ్చరిక
అమరావతి : రాష్ట్రంలో బీజేపీకి బలం లేకపోయినా కుట్రలు చేయడానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వైసీపీకి మేలు చేయడానికే ఏపీపై బీజేపీ ప్రత్యేక

అమరావతి : రాష్ట్రంలో బీజేపీకి బలం లేకపోయినా కుట్రలు చేయడానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వైసీపీకి మేలు చేయడానికే ఏపీపై బీజేపీ ప్రత్యేక
అమరావతి : రాష్ట్రంలో బీజేపీకి బలం లేకపోయినా కుట్రలు చేయడానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వైసీపీకి మేలు చేయడానికే ఏపీపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మోడీ, కేసీఆర్, జగన్ కుమ్మక్కు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి….ముగ్గురు లాలూచీని ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి నాటికి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి.. త్వరలో జిల్లా పర్యటనలు ప్రారంభిస్తానని ప్రకటించారు. ఢిల్లీలో నిర్వహించే దీక్షకు నేతలంతా ఇప్పటి నుంచే రెడీ కావాలని దిశానిర్దేశం చేశారు.
అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం హాట్‌హాట్‌గా సాగింది. రాష్ట్రంలో బీజేపీకి ఏ నియోజకవర్గంలోనూ 0.5శాతం ఓట్లు కూడా రావని.. అయినా కుట్రలు పన్నడానికి కారణం వైసీపీకి మేలు చేయడానికేనని చంద్రబాబు ఆరోపించారు. ఏపీకి మోడీ అన్యాయం చేస్తూ…తెలంగాణకు మేలు చేస్తున్నారని.. తెలంగాణ నుంచి రావాల్సిన 5వేల కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు, హయ్యర్ ఎడ్యుకేషన్ నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. కోర్టు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు.
రెండేళ్లుగా అసెంబ్లీకి రాని వాళ్లు దేశంలో ఎక్కడా లేరని వైసీపీనుద్ధేశించి విమర్శలు గుప్పించారు. ప్రపంచ చరిత్రలో వైసీపీలా ఎవరూ చేయలేదన్న ఆయన….బాధ్యతారాహిత్యానికి ప్రతిబింబమే జగన్ అన్నారు. అఖిలపక్ష భేటీలకు, సమాచార కమిషనర్ల నియామకాలకు రాని నేతలను ఎన్నడూ చూడలేదన్నారు. నవ్వుతారన్న ఆలోచన కూడా లేకుండా.. కియా పరిశ్రమ తెచ్చామంటూ బీజేపీ నేతలు అబద్దాలు చెబుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు కేంద్రం ఎన్ని తాయిలాలు ప్రకటించినా బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
ఫిబ్రవరి నెలాఖరుకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు రూపొందించుకోవాలన్న ఆయన… 30 రోజుల పాటు పూర్తి స్థాయిలో ప్రచారం చేయనున్నట్లు వెల్లడించారు. రోజుకు రెండు జిల్లాలు తిరగాలా ? లేదంటే రోడ్డు షోలు నిర్వహించాలా ? అదీ కుదరకపోతే బస్సు యాత్ర చేపట్టాలా అన్న అంశాలను పరిశీలిస్తున్నట్లు ఎమ్మెల్యేలకు తెలిపారు. ఫిబ్రవరి 1న నల్లబ్యాడ్జీలతో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకావాలన్న చంద్రబాబు….కేంద్రం చేసిన ద్రోహానికి నిరసనగా ర్యాలీలు చేపట్టాలన్నారు.
అంతకుముందు టీడీపీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం మళ్లీ రాకపోతే రాష్ట్రంలో అరాచకం సృష్టించి భవిష్యత్తును అంధకారం చేస్తారని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 11న డిల్లీలో తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు ఇప్పటి నుంచే అందరూ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో ఎంపీలు పోరాటాన్ని మరింత తీవ్రం చేయాలని సూచించారు.