రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్, రేణుక.. చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్, ఎవరీ అనిల్ కుమార్ యాదవ్

చివరి నిమిషంలో అనిల్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ అగ్రనాయకత్వం.

రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్, రేణుక.. చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్, ఎవరీ అనిల్ కుమార్ యాదవ్

Congress Rajya Sabha Candidates

Congress Rajya Sabha Candidates : తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులను ఏఐసీసీ అధికారికంగా ఖరారు చేసింది. సీనియర్ నేత రేణుక చౌదరి, యూత్ కాంగ్రెస్ లీడర్ అనిల్ కుమార్ యాదవ్ పేర్లను అనౌన్స్ చేశారు. కాగా, అనూహ్యంగా అనిల్ కుమార్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారులో ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పాలి. చివరి నిమిషంలో అనిల్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. యువతను ఎంకరేజ్ చేసేలా అనిల్ కుమార్ యాదవ్ కు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 27న 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తమ అభ్యర్థులను కాంగ్రెస్ అనౌన్స్ చేసింది. సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరికి రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం కల్పించడం జరిగింది. అలాగే యువకుడు, యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు.

Also Read : హరీశ్ రావుకి మంత్రి పదవి ఇస్తాం- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, నేషనల్ యూత్ కాంగ్రెస్ ఎఫైర్స్ లో అనిల్ కుమార్ యాదవ్ చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బల్మూర్ వెంకట్ కు ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ కు అవకాశం ఇచ్చారు. ఇంత చిన్న వయసులో రాజ్యసభకు ఎన్నిక కావడం అనేది కీలక నిర్ణయం చెప్పొచ్చు.

Also Read : పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు- కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

రాజ్యసభ అవకాశం ఇస్తారని నా జీవితంలో ఊహించలేదు- అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి నా లాంటి యువకుడికి అధిష్టానం రాజ్యసభ అవకాశం ఇవ్వడం అనందంగా ఉంది. కష్టపడే వారికి కాంగ్రెస్ లో పదవులు దక్కుతాయి అనడానికి ఇదే ఉదాహరణ. నాకు పదవి ఇవ్వడం యూత్ కాంగ్రెస్ కార్యకర్తల కృషి. బీసీల తరపున కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు. కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి తేవడమే రాహుల్ గాంధీ లక్ష్యం. బల్మూర్ వెంకట్ కి ఎమ్మెల్సీ, నాకు రాజ్యసభ ఇవ్వడంతో యువకులకు కాంగ్రెస్ ఇస్తున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. రాజ్యసభ అవకాశం ఇస్తారని నా జీవితంలో ఊహించలేదు.