Digvijiaya Singh: నెహ్రూ-గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ శూన్యం
అశోక్ గెహ్లాటే మా అభ్యర్థిగా ఉంటే బాగుండని ఇప్పటికీ అనిపిస్తుంది. గెహ్లాట్ పోటీ చేస్తే దాన్ని మేమంతా చాలా గౌరవంగా తీసుకునేవాళ్లం. కాంగ్రెస్ పార్టీకి ఆయన చాలా విధేయుడిగా ఉన్నారు. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. నిజంగా ఇది దురదృష్టకరం. మేమంతా గాంధీ-నెహ్రూ ఐడియాలజీతో ఉన్నవారిమే. మా అందరిదీ ఒకే భావజాలం. మేం ఒకరికొకరు పోటీ పడతాం. కానీ కాంగ్రెస్ పార్టీని మరింత శక్తివంతం చేయడానికే ప్రయత్నిస్తాం

Congress nothing without Gandhis says Digvijiaya Singh
Digvijiaya Singh: నెహ్రూ-గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ శూన్యమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికకు నామినేషన్ రేపటితో ముగుస్తుంది. అయితే ఈ పోటీలో ఉన్న దిగ్విజయ్ సింగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో అనేకమైన గ్రూపులు ఎప్పటి నుంచో ఉంటూ వస్తున్నాయని, అయితే 99 శాతం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గాంధీ కుటుంబానికి మద్దతుగా ఉంటారని ఆయన అన్నారు.
ఇక రాజస్తాన్ సంక్షోభాన్ని దురదృష్టకరమంటూ దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. ‘‘అశోక్ గెహ్లాటే మా అభ్యర్థిగా ఉంటే బాగుండని ఇప్పటికీ అనిపిస్తుంది. గెహ్లాట్ పోటీ చేస్తే దాన్ని మేమంతా చాలా గౌరవంగా తీసుకునేవాళ్లం. కాంగ్రెస్ పార్టీకి ఆయన చాలా విధేయుడిగా ఉన్నారు. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. నిజంగా ఇది దురదృష్టకరం. మేమంతా గాంధీ-నెహ్రూ ఐడియాలజీతో ఉన్నవారిమే. మా అందరిదీ ఒకే భావజాలం. మేం ఒకరికొకరు పోటీ పడతాం. కానీ కాంగ్రెస్ పార్టీని మరింత శక్తివంతం చేయడానికే ప్రయత్నిస్తాం’’ అని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
Sachin Pilot: నేను మాట్లాడుతుంటే సోనియా శ్రద్ధగా విన్నారు.. సమావేశం అనంతరం పైలట్