Congress President Polls: హైదరాబాద్ చేరుకున్న మల్లికార్జున ఖర్గే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కాసేపట్లో భేటీ

ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నికకు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తమ పార్టీ నేతల మద్దతు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం గాంధీ భవన్ కు బయలుదేరారు. పీసీసీ ప్రతినిధులతో ఖర్గే సమావేశం కానున్నారు.

Congress President Polls: హైదరాబాద్ చేరుకున్న మల్లికార్జున ఖర్గే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కాసేపట్లో భేటీ

Mallikarjun Kharge

Updated On : October 8, 2022 / 12:04 PM IST

Congress President Polls: ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నికకు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తమ పార్టీ నేతల మద్దతు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం గాంధీ భవన్ కు బయలుదేరారు. పీసీసీ ప్రతినిధులతో ఖర్గే సమావేశం కానున్నారు.

ఎన్నికలో తనకు ఓటేయాలని మద్దతు కోరనున్నారు. ఎన్నిక బరిలో మల్లికార్జున ఖర్గేతో పాటు శశి థరూర్ నిలిచారు. ఇప్పటికే శశి థరూర్ హైదరాబాద్ లో పర్యటించారు. అయితే, గాంధీ కుటుంబం మల్లికార్జున ఖర్గేకు మద్దతు ఇస్తోందని జరుగుతోన్న ప్రచారం నేపథ్యంలో శశి థరూర్ హైదరాబాద్ పర్యటనలో ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు కలవలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక పోటీలో మల్లికార్జున ఖర్గే గెలిచే అవకాశాలే అధికంగా ఉన్నాయి. ఈ నెల 18న ఎన్నిక జరగనుంది. 2002 తర్వాత తొలిసారి ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..