పశ్చిమగోదావరిలో తెలంగాణ కండక్టర్‌కు కరోనా లక్షణాలు

  • Published By: madhu ,Published On : March 5, 2020 / 06:14 AM IST
పశ్చిమగోదావరిలో తెలంగాణ కండక్టర్‌కు కరోనా లక్షణాలు

Updated On : March 5, 2020 / 6:14 AM IST

వెస్ట్ గోదావరిలో కరోనా కలకలం రేపింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్ కండక్టర్‌కి కరోనా లక్షణాలు బయటపడడం తీవ్ర భయాందోనళలకు గురి చేసింది. చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి..ఇతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. (కరోనా ఎఫెక్ట్ – మూతపడనున్న థియేటర్లు?)

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ కండక్టర్‌ రెండు రోజుల నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాద పడుతున్నాడు. డ్యూటీ నిమిత్తం 2020, మార్చి 05వ తేదీ గురువారం చింతలపూడికి వచ్చాడు. కానీ తీవ్రమైన ఫీవర్ ఉండడంతో ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే డాక్టర్లు అలర్ట్ అయ్యారు. ఇతడికి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం ఇతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం..ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించే అవకాశం ఉంది. మరోవైపు పెంటపాడు మండలానికి చెందిన మామ, అలుళ్లకు కూడా కరోనా లక్షణాలు ఉండడంతో వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం..వీరందరీ రక్తనమూనాలను సేకరించి…హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. వెస్ట్ గోదావరిలో కరోనా వైరస్ వ్యాపించందనే వార్తలు గుప్పుమనడంతో జిల్లా వాసులు భయపడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

Read More : వరుణుడి దయ : T-20 ఉమెన్ వరల్డ్ కప్ ఫైన‌ల్‌లో భారత్