దగ్గుబాటి వర్సెస్ ఏలూరి : అసమ్మతి చుట్టూ పర్చూరు రాజకీయం

ప్రకాశం జిల్లా: ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్త నేతల్ని మచ్చిక చేసుకోవడం.. వారినే అస్త్రాలుగా మార్చుకుని ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడడం.. ఇదే ప్రస్తుతం ఆ జిల్లాలో నడుస్తున్న

  • Published By: veegamteam ,Published On : February 8, 2019 / 06:15 AM IST
దగ్గుబాటి వర్సెస్ ఏలూరి : అసమ్మతి చుట్టూ పర్చూరు రాజకీయం

Updated On : February 8, 2019 / 6:15 AM IST

ప్రకాశం జిల్లా: ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్త నేతల్ని మచ్చిక చేసుకోవడం.. వారినే అస్త్రాలుగా మార్చుకుని ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడడం.. ఇదే ప్రస్తుతం ఆ జిల్లాలో నడుస్తున్న

ప్రకాశం జిల్లా: ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్త నేతల్ని మచ్చిక చేసుకోవడం.. వారినే అస్త్రాలుగా మార్చుకుని ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడడం.. ఇదే ప్రస్తుతం ఆ జిల్లాలో నడుస్తున్న రాజకీయం. దీంతో వీరు వారికి గాలం వేయడం.. వారు వీరికి గాలం వేయడం నిత్యకృత్యమైపోయింది. ఫలితంగా ఆ నియోజకవర్గంలో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

 

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. ఇప్పటివరకు నియోజకవర్గంలో తమకు ఎదురు లేదనుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.. దగ్గుబాటి కుటుంబం జగన్‌ను కలవటంతో అలర్టయ్యారు. తన వ్యూహాలకు పదును పెట్టి దగ్గుబాటికి వ్యతిరేకంగా పావులు కదిపారు. స్థానిక వైసీపీ సమన్వయకర్తగా పనిచేస్తూ టికెట్ ఆశిస్తున్న రావి రామానంద బాబు అసంతృప్తి వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని వైసీపీలో కుంపట్లను రాజేశారు. దగ్గుబాటి రాకను వ్యతిరేకిస్తున్న రావి రామానందబాబు వర్గం రోడెక్కి ఆందోళన చేపట్టింది.

 

ఈ అనూహ్య పరిణామాలను పసిగట్టిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. టీడీపీ వైపు వెళ్లిన తన అనుచరవర్గంతోపాటు అసంతృప్తి వాదులను ఏకం చేసే పనిలో పడ్డారు. 2014లో టీడీపీ నుంచి విజయం సాధించిన ఏలూరి సాoబశివరావు.. టీడీపీ కార్యకర్తలను కాదని.. ప్రత్యేకంగా తన వర్గాన్ని తయారు చేసుకున్నారు. అప్పట్నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న అధికార పార్టీ అసమ్మతి నేతలు తమకంటూ టైమ్ రావడంతో దెబ్బకొట్టేందుకు ఏకమయ్యారు. 3 మండలాలకి సంబంధించిన 30మంది కీలక నాయకులు తమ ఏలుబడిలో ఉన్న గ్రామాల్లోని 2వేల మంది కార్యకర్తలతో సమావేశం కావటం అధికార పార్టీలో సంచలనం రేపుతోంది.

 

తమను చులకనగా చూసిన ఏలూరికి అనుకూలంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే.. రెబల్ అభ్యర్థిని రంగంలోకి దించి తమ సత్తా చాటుతామని టీడీపీ అసమ్మతి వర్గం హెచ్చరిస్తోoది. దీంతో ఇప్పుడు ఏలూరి దగ్గుబాటికి చెందిన మరో వర్గాన్ని రెచ్చగొట్టే పనిలో పడ్డారట. ఇలా అధికార, ప్రతిపక్షాలు అసంతృప్తి నేతల్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలను నడుపుతుండడంతో ఎవరు ఏ క్షణంలో ఏ పార్టీలో తేలుతారోననేది ప్రశ్నార్థకంగా మారింది.