బాబుతో పొత్తు వల్లే నష్టం: కొమటిరెడ్డి 

  • Published By: chvmurthy ,Published On : January 19, 2019 / 08:31 AM IST
బాబుతో పొత్తు వల్లే నష్టం: కొమటిరెడ్డి 

Updated On : January 19, 2019 / 8:31 AM IST

హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో పొత్తు వల్లే నష్టపోయామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత ఎంపికలో రాహుల్ గాంధీ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తామని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ అన్నట్టు ఎన్నికలు జరిగాయని, ఎన్నికల్లో ఓటమికి ఒక్కరినీ బాధ్యత చేయటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. సీట్ల కేటాయింపులో కూడా కొన్ని లోపాలు జరిగాయని, అధిష్టానం కూడా సీట్ల  పంపకంలో కొంచెం ముందుగా ఇస్తే బాగుండేదని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ తో పొత్తు ఉంటుందా, లేదా అన్నది రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారు అని ఆయన చెప్పారు.