Durbari Kutte: ‘సోనియా గాంధీ కుక్కలు’.. ఖర్గే ‘కుక్క’ వ్యాఖ్యలపై వివాదాస్పదంగా స్పందించిన బీజేపీ నేత

కాంగ్రెస్ నేతలకు కుక్కల్లా తిరగడమే అలవాటు. మనుషులుగా తిరిగే అలవాటును వారు ఎప్పుడో కోల్పోయారు. వాళ్లు సోనియా గాంధీ దర్బార్ కుక్కలుగా మారిపోయారు. దేశభక్తి అనేది పూర్తిగా మర్చిపోయారు. దేశ సైనికులను కూడా గౌరవించరు. మల్లికార్జున ఖర్గే కూడా 10 జన్‭పథ్‭కు కుక్కలా తయారయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కుక్కలు కాబట్టే వారికి మిగతా వారు కూడా కుక్కలుగా కనిపిస్తున్నారు

Durbari Kutte: ‘సోనియా గాంధీ కుక్కలు’.. ఖర్గే ‘కుక్క’ వ్యాఖ్యలపై వివాదాస్పదంగా స్పందించిన బీజేపీ నేత

Durbari kutte of Sonia Gandhi says BJP MLA over Congress chief's dog remark

Updated On : December 21, 2022 / 4:25 PM IST

Durbari Kutte: భారత స్వాతంత్ర్య పోరాటంలో భారతీయ జనతా పార్టీ పాత్రే లేదని చెప్పే క్రమంలో ఆ పార్టీ నుంచి ఒక కుక్క కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించలేదంటూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఇప్పటికే అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ నేతలు ఈ విషయమై ఒకరికొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కాగా, ఖర్గే వ్యాఖ్యలను తిప్పి కొట్టే క్రమంలో బీజేపీకి చెందిన నేత, మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ వివాదాస్పదంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నేతలను సోనియా గాంధీ దర్బార్ కుక్కలు అంటూ ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు.

Tata Nano Electric Car: అద్భుత ఫీచర్లతో మార్కెట్‌లోకి వస్తున్న టాటా నానో ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే?

‘‘కాంగ్రెస్ నేతలకు కుక్కల్లా తిరగడమే అలవాటు. మనుషులుగా తిరిగే అలవాటును వారు ఎప్పుడో కోల్పోయారు. వాళ్లు సోనియా గాంధీ దర్బార్ కుక్కలుగా మారిపోయారు. దేశభక్తి అనేది పూర్తిగా మర్చిపోయారు. దేశ సైనికులను కూడా గౌరవించరు. మల్లికార్జున ఖర్గే కూడా 10 జన్‭పథ్‭కు కుక్కలా తయారయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కుక్కలు కాబట్టే వారికి మిగతా వారు కూడా కుక్కలుగా కనిపిస్తున్నారు’’ అంటూ రామేశ్వర్ శర్మ తీవ్రంగా స్పందించారు.

Manipur: ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూలు బస్సులు ఢీ.. 15 మంది విద్యార్థులు మృతి

భారత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం రాజస్తాన్ రాష్ట్రంలోని అల్వార్‭లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ ‘‘బయటికేమో సింహంలాంటి మాటలు మాట్లాడతారు. కానీ చిట్టెలుకలా ప్రవర్తిస్తున్నారు. సరిహద్దుల వెంబడి చైనా దురాక్రమణలకు పాల్పడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? దీనిపై పార్లమెంట్‭లో చర్చ కూడా చేయడం లేదు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం చేసింది. అనేక మంది కాంగ్రెస్ నాయకులు ప్రాణత్యాగాలు చేశారు. మరి బీజేపీ ఏం చేసింది? స్వాతంత్ర్యం కోసం బీజేపీ ఒక కుక్కనైనా కోల్పోయిందా? మమ్మల్ని దేశద్రోహులు అంటున్నారు. ఇంతకీ దేశానికి వాళ్లు (బీజేపీ) చేసింది ఏంటి?’’ అని ఖర్గే మండిపడ్డారు.