KTR : కాంగ్రెస్‌కు ఓటువేసి మోసపోయామని వాపోతున్నారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

మార్పు అని ఓటేస్తే మా కడుపు కొట్టాడని ఆటో డ్రైవర్లు బాధ పడుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే కాంగ్రెస్ ను బొంద పెడతాం.

KTR : కాంగ్రెస్‌కు ఓటువేసి మోసపోయామని వాపోతున్నారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR Slams Congress Government

KTR : హైదరాబాద్ అంబర్ పేట లో బీఆర్ఎస్ పార్టీ సమ్మేళనం లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనం అందరి నుంచి ఒక్కటే మాట వినిపిస్తోందన్నారు. తప్పిదారి కాంగ్రెస్ కు ఓటు వేశామని జనం అనుకుంటున్నారు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూసి మోసపోయామని జనం చెబుతున్నారు అని కేటీఆర్ అన్నారు. గ్రేటర్ లో గోషామహల్ మినహా అన్నీ మనమే గెలిచామన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలు జనంలోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేటీఆర్. కాంగ్రెస్ నాయకులను విడిచి పెట్టే ప్రసక్తే లేదన్నారాయన.

”అందరికీ అన్నీ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కొందరికే కొన్ని అంటున్నారు. అన్ని హామీలు ఇచ్చే వరకు వదిలిపెట్టం. సచివాలయంలో లంకె బిందెలు ఉండవు. ఫైళ్లు, కంప్యూటర్లు ఉంటాయి. జనం సమస్యలు తీర్చాలి. 18ఏళ్లు నిండిన కోటి 67 లక్షల మంది మహిళలు ఉన్నారు. వాళ్ళకి రూ.2500 పెన్షన్ ఇవ్వాలి. మార్చి 17 కు 100 రోజులు నిండుతాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే కాంగ్రెస్ ను బొంద పెడతాం. మార్పు అని ఓటేస్తే మా కడుపు కొట్టాడని ఆటో డ్రైవర్లు బాధ పడుతున్నారు. కోటి 37 లక్షల 50 వేల కరెంట్ మీటర్లు ఉన్నాయి. వాళ్ళలో కొంతమందికి ఉచిత విద్యుత్ ఇస్తామని చెబుతున్నారు. ఇదే విషయం ఎన్నికల ముందు చెప్తే కాంగ్రెస్ ను తన్ని పంపేవారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పై గులాబీ జెండా ఎగరాలి” అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్.

Also Read : కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డే కాదు.. కేటీఆర్ వివరణ