అందుకే వైసీపీలో చేరా, మళ్లీ జగనే సీఎం- రావెల కిశోర్ బాబు
జగన్ చేస్తున్న మాహా యజ్ఞంలో నేను భాగస్వామ్యం అవుతాను. జగన్ ఏ బాధ్యత ఇస్తే అది తీసుకుని కష్టపడి పని చేస్తా.

Ravela Kishore Babu On CM Jagan
Ravela Kishore Babu : మాజీమంత్రి రావెల్ కిశోర్ బాబు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మాట్లాడిన రావెల కిశోర్ బాబు.. సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. పేదల పక్షాన నిలబడి, అంబేద్కర్ బాటలో నడుస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని రావెల కిశోర్ బాబు ప్రశంసించారు. సమసమాజ స్థాపనకు నిరంతరం జగన్ కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. అంబేడ్కర్ సిద్దాంతాలు అమలు చేస్తున్న నాయకుడు జగన్ అని అన్నారు. అవినీతి లేకుండా జగన్ పాలన సాగుతోందన్నారు.
Also Read : వైసీపీలో మార్పులు.. సంబరపడిపోతున్న ఓ మంత్రి, మరో ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?
జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఓ విప్లవం అన్నారు రావెల కిశోర్ బాబు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో ఏపీ దూసుకుపోతోందని, మళ్ళీ జగన్ సీఎం అవ్వాలని ప్రజలు చూస్తున్నారని రావెల్ కిశోర్ బాబు వెల్లడించారు. జగన్ పాలన నచ్చి వైసీపీలో చేరానని ఆయన తెలిపారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ జగన్ తోనే ఉంటాను అని చెప్పారు.
జగన్ చేస్తున్న మాహా యజ్ఞంలో నేను భాగస్వామ్యం అవుతాను అన్నారు. జగన్ ఏ బాధ్యత ఇస్తే అది తీసుకుని కష్టపడి పని చేస్తానని పేర్కొన్నారు. జగన్ ఏం ఆదేశిస్తే అది చేస్తాను. పోటీ చెయ్యమంటే చేస్తా.. పార్టీకి పని చెయ్యమంటే చేస్తా.. అని రావెల కిశోర్ బాబు చెప్పారు.
Also Read : భార్యభర్తల మధ్యే ఆధిపత్య పోరాటం.. టెక్కలి వైసీపీలో గ్రూప్ వార్