అవినీతిలో ఆంధ్రప్రదేశ్ గిన్నిస్ రికార్డు సృష్టించేలా ఉంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవనీతిపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అజయ్ కల్లాం తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. రాష్ట్రంలో అవినీతి సంస్థాగతంగా మారిపోయిందని, అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించేలా ఉందని ఆయన అన్నారు. ఇసుకను మట్టిని కూడా దోచుకుంటున్నారని, సీఎం దగ్గరి నుంచి నాయకులు, ఉద్యోగులు పథకం ప్రకారం పంచేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్–సేవ్ డెమోక్రసీ’ సదస్సులో పాల్గొన్న ఆయన రాష్ట్రంలోని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో ఇరిగేషన్ పరంగా 2014 జూలై నాటికి పోలవరం మనిహా మిగిలిన 23 ప్రాజెక్టులకు రూ.17 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా చేశారని, ప్రస్తుతం రూ.51 వేల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోందని, మూడు రెట్లు అధికంగా ఖర్చు పెట్టినా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాట్లేదని ఆయన ప్రశ్నించారు. ర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాలను దోపిడీ కోసమే భారీగా పెంచుతున్నారని ఆరోపించారు. ప్రతి అభివృద్ధి పనిలోనూ 30 శాతం నుంచి 40 శాతం కమీషన్లు, లంచాలు రూపంలో దోపిడీ జరుగుతోందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా జరుగుతున్న ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆయన అన్నారు.