టీడీపీలోకి మహేష్ బాబాయ్ : చంద్రబాబుతో భేటీ

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 06:39 AM IST
టీడీపీలోకి మహేష్ బాబాయ్ : చంద్రబాబుతో భేటీ

అమరావతి : ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఏపీ సీఎం చంద్రబాబుని కలిశారు. చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. పలు అంశాలపై మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న చంద్రబాబుని శేషగిరిరావు అభినందించారు. వైసీపీ విధానాలు నచ్చకనే బయటకు వచ్చేశానని శేషగిరి చెప్పారు. అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. తన అన్న, సూపర్ స్టార్ కృష్ణ మద్దతు లేకుండా ఏ పని చేయను అని శేషగిరిరావు చెప్పారు.

 

చంద్రబాబు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్టు వస్తున్న వార్తలపై శేషగిరిరావు స్పందించారు. ఆ వార్తలు ఊహాగానాలే అని స్పష్టం చేశారు. మళ్లీ సీఎంగా చంద్రబాబే అవుతారని ఆది శేషగిరిరావు జోస్యం చెప్పారు.