నష్టాలను అధిగమించేందుకు : ఎర్రబస్సుల్లో సరుకు రవాణా

టీఎస్ఆర్టీసీ సరుకు రవాణా రంగంలో అడుగు పెట్టనుంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారైంది. జనవరి 1 నుంచి గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసను ప్రారంభించబోతంది. ఆర్టీసీ నష్టాలను అధిగమించేందుకు సరుకు రవణా బస్సులు నడపాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటివిడతగా 1209 మంది సిబ్బందిని, 822 డీజీటీ సర్వీసులను ఆర్టీసీ తెస్తోంది.
ఒక్కో డిపోకు రెండు డీజీటీ వెహికిల్స్‌ను అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. హైదరాబాద్‌లోని 29 డిపోల్లో సుమారు 60 డీజీటీలు అందుబాటులోకి రానున్నాయి. మిగతావాటిని జిల్లాల్లోని డిపోలకు పంపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. డిసెంబర్ 1న ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఆర్టీసి యాజమాన్యం చర్యలు ప్రారంభించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధిక కిలోమీటర్లు తిరిగి, కండీషన్‌లో ఉన్న 1000 బస్సులను సరుకు రవాణాకు అనుగుణంగా మార్చాలని నిర్ణయించారు. వాటిని బస్‌బాడీ బిల్డింగ్‌లకు పంపిస్తున్నారు. బస్సుల రద్దుతో అదనంగా ఉండే ఉద్యోగులను కార్గో సర్వీసులకు ఉపయోగించుకోనున్నారు. ఆర్టీసీ సంస్కరణలపై ఉన్నతాధికారులతో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమీక్షించారు. ఆర్టీసీ అభివృద్ధిపై చర్చించారు. సరుకు రవాణాకు వసూలు చేసే చార్జీలపై వేరు వేరు డిపోల పరిధిలో అధ్యయనం చేసి ఆయా డిపో మేనేజర్లు ఇచ్చి రిపోర్టుల ఆధారంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
సరుకు రవాణా బస్సులకు ఎర్ర రంగు వేయాలని నిర్ణయించారు. సరుకు రవాణా కోసం పనిచేసే డ్రైవర్లు, సిబ్బందికి ప్రత్యేక డెస్ కోడ్ అమలు చేయాలని నిర్ణయించారు. ప్రైవేటు ఆపరేటర్లకు ధీటుగా పనిచేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. విస్తృతమైన నెట్ వర్క్ ఆధారంగా సరుకు రవాణా రంగంలో విజయం సాధిస్తామని ఆర్టీసీ అధికారులు ధీమా వ్యక్తం చేశారు.
Read More : రిపబ్లిక్ డే వేడుకలకు ఎంపికైన తెలంగాణ రాష్ట్ర శకటం