Cm Revanth Reddy: పాలనా యంత్రాంగంలో భారీ ప్రక్షాళన..! సీఎం రేవంత్ సరికొత్త కసరత్తు వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి?
అధికారుల్లో..తాము వేరయా అన్నట్లు..ఐఏఎస్ అధికారులు భావిస్తుంటారు..వ్యవహరిస్తుంటారు కూడా. ఇలా కన్ఫర్డ్ ఐఏఎస్‌లకు..ఐఏఎస్‌ల మధ్య కూడా..గతంలో డిసిగ్నేషన్ పంచాయితీతో ఇగో క్లాషెస్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
Cm Revanth Reddy: ఇప్పటి దాకా ఒక లెక్క. ఇక నుంచి మరో లెక్క. రాష్ట్ర పాలనా యంత్రాంగంలో తన మార్క్‌తో భారీ ప్రక్షాళనకు ప్లాన్ చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్ నుంచి జిల్లా కలెక్టరేట్ దాకా ఐఏఎస్ ట్రాన్స్ఫర్లలో ఉన్న అన్ని చిక్కులకు చెక్ పెట్టే స్కెచ్ వేస్తున్నారట. అడ్మినిస్ట్రేటివ్ రీషఫ్లింగ్కు రెడీ అవుతున్నారట. రేవంత్ సరికొత్త కసరత్తు వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి?
అధికార యంత్రాంగంలో మార్పులు, చేర్పులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్. ఇందులో భాగంగా త్వరలోనే భారీగా ఐఏఎస్ ల బదిలీలు చేయబోతున్నారట. ఈసారి ట్రాన్స్ఫర్స్ కసరత్తు..ఇప్పటివరకు ఒక లెక్క..ఇక నుంచి మరో లెక్క అన్నట్లు నడుస్తోందట. రెండున్నరేళ్ల కాలంలో ఐదారుసార్లు ఐఏఎస్‌ల బదిలీలు చేసింది రేవంత్ సర్కార్. ఒక్కోసారి..పదుల సంఖ్యలో టాన్స్ఫర్లు చేసిన సందర్భాలున్నాయి. జిల్లా కలెక్టర్ల నుంచి మొదలుకుని..సెక్రటేరియట్లో ప్రిన్సిపల్, స్పెషల్ సెక్రటరీల వరకు..అందరికీ స్థానం చలనం కల్పించింది. అయితే..ఈ బదిలీల్లో జరిగిన చిన్న తప్పిదాలు… కింది స్థాయి అధికారుల నుంచి..పై స్థాయి అధికారుల వరకు..క్లాషెస్‌కు దారితీసింది.
సీనియర్ వర్సెస్ జూనియర్ కోల్డ్ వార్ ఇష్యూ అయింది. GHMC కమిషనర్‌గా ఓ అధికారికి పోస్టింగ్ ఇచ్చిన సర్కార్..ఆయన కింద జోనల్ కమిషనర్‌గా..ఓ సీనియర్ ఐఏఎస్ ఉన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోయిందట. దీంతో నొచ్చుకున్న సదరు సీనియర్ ఐఏఎస్ ఇగో హర్ట్ కావడంతో లాంగ్ లీవ్‌లో వెళ్లిపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
అధికారుల్లో..తాము వేరయా అన్నట్లు..ఐఏఎస్ అధికారులు భావిస్తుంటారు..వ్యవహరిస్తుంటారు కూడా. ఇలా కన్ఫర్డ్ ఐఏఎస్‌లకు..ఐఏఎస్‌ల మధ్య కూడా..గతంలో డిసిగ్నేషన్ పంచాయితీతో ఇగో క్లాషెస్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య కన్ఫర్డ్ ఐఏఎస్‌లలో ఒకరికి స్పెషల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇవ్వగా..ఆయనకంటే సీనియర్ ఐఏఎస్ సెక్రటరీగా ఉన్న సందర్భం ఎదురైంది. దీంతో సదరు ఐఏఎస్..వాట్ ఈజ్ దిస్ అంటూ బాగా ఫీల్ కావడంతో..అప్పటికప్పుడు సెక్రటరీని స్పెషల్ సెక్రటరీగా మార్చారట.
పంచాయతీలకు చెక్ పెట్టేలా షఫ్లింగ్..
ఇక టూరిజం శాఖలో అయితే ఇప్పటివరకు అరడజన్ మంది సెక్రటరీలు రావడం..పోవడం ఓ తంతుగా మారిపోయిందట. ఇక ఎన్నిసార్లు బదిలీలు జరిగినా.. హెల్త్ సెక్రటరీ సహా మరికొందరికి ఎందుకోగానీ స్థాన చలనం లేదనే టాక్ సెక్రటేరియట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇలా..ఒక్కోచోట..ఒక్కో రకంగా..ఐఏఎస్‌ల ట్రాన్స్ఫర్లలో జరుగుతున్న పొరపాట్లను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి..వీటన్నింటికి చెక్ పెట్టాలని భావిస్తున్నారట. మరోవైపు తెలంగాణ అధికారులకు కీలక పోస్టింగ్‌లు ఇవ్వడం లేదన్న విమర్శలకు కూడా చెక్ పెట్టాలన్న ఆలోచనలో రేవంత్ అండ్ టీం కసరత్తు చేస్తోందట. మరికొన్ని శాఖల్లో మంత్రులకు, ఐఏఎస్‌ల మధ్య జరుగుతున్న పంచాయతీలకు చెక్ పెట్టేలా షఫ్లింగ్ చేయనున్నారని తెలుస్తోంది.
ఐఏఎస్ ల మధ్య ఇగో క్లాషెస్‌కు ఫుల్ స్టాప్ పెట్టేలా..
త్వరలో రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల సమూల బదిలీలకు రంగం సిద్దం చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. కేవలం బదిలీలు అంటే ఒకరిని తీసి మరొకరిని పెట్టడం కాదు..పూర్తిగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా కసరత్తు జరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా..సీనియర్, జూనియర్ల కోల్డ్ వార్, కన్ఫర్డ్ ఐఏఎస్, ఐఏఎస్‌ల మధ్య ఇగో క్లాషెస్‌కు ఫుల్ స్టాప్ పెట్టేలా ఎక్సర్ సైజ్ చేస్తోందట సర్కార్.
కీలకమైన పోస్టుల కోసం జరుగుతున్న పోటీకి బ్రేక్స్ వేసి..ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి? ఎవరి సీనియారిటీకి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలనేది ఒక పద్ధతి ప్రకారం జరగాలని రేవంత్ రెడ్డి క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చారట. దీనిలో భాగంగా..రేవంత్ మార్క్ అడ్మినిస్ట్రేటీవ్ రీషఫ్లింగ్తో న్యూటీమ్ రెడీ అవుతుందని టాక్. ఈ సారి జరిగే ఐఏఎస్‌ల బదిలీల్లో..అధికారుల లాబీయింగ్‌కు చెక్ పెట్టి..ఫెర్మామెన్స్, లాయల్టీ, ఎఫీషియన్సీకి పెద్దపీట వేయనున్నారట. ఇప్పటివరకు పనితీరు బాగా కనబరిచిన అధికారులకు ప్రమోషన్లు ఇవ్వాలన్నది సీఎం ఆలోచన అంటున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి తన మార్క్ మార్పులతో పర్ఫెక్ట్ టీమ్‌ను సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట. తన స్పీడ్‌కు అనుగుణంగా..క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులను ఎంపిక చేయనున్నారట. రేవంత్ మార్క్ ఐఏఎస్ టీమ్ ఎలా ఉండనుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
Also Read: కాళేశ్వరం ఎపిసోడ్లో పైచేయి ఎవరిది? కొత్త టర్న్ తీసుకోనుందా?
