బీసీకి పట్టం : జంగా కృష్ణమూర్తికి వైసీపీ ఎమ్మెల్సీ పదవి
ఏలూరు : ఏపీలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ చీఫ్ జగన్ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. వైసీపీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తిని ఎంపిక చేసినట్టు జగన్

ఏలూరు : ఏపీలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ చీఫ్ జగన్ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. వైసీపీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తిని ఎంపిక చేసినట్టు జగన్
ఏలూరు : ఏపీలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ చీఫ్ జగన్ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. వైసీపీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తిని ఎంపిక చేసినట్టు జగన్ తెలిపారు. ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన వైసీపీ ‘బీసీ గర్జన’ సభలో జగన్ మాట్లాడారు. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని, ఫిబ్రవరి 22న నోటిఫికేషన్ రానుందని జగన్ తెలిపారు. టీడీపీకి 4 పదవులు వస్తాయన్నారు. వైసీపీ మాత్రం ఒకే ఒక్క ఎమ్మెల్సీ పదవి వస్తుందని చెప్పారు. వైసీపీకి వచ్చే ఒకే ఒక్క ఎమ్మెల్సీ పదవిని జంగా కృష్ణమూర్తికి ఇవ్వనున్నట్టు జగన్ హామీ ఇచ్చారు. బీసీ సమస్యల అధ్యయన కమిటీలో జంగా కృష్ణమూర్తి కీలకంగా వ్యవహరించారు.
బీసీ గర్జన సభలో జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీలపై వరాల జల్లు కురిపించారు. అధికారంలోకి వస్తే శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. బీసీ కమిషన్‌కు చట్టబద్దత కల్పిస్తామన్నారు. బీసీల అభివృద్ధికి ఏటా రూ.15వేల కోట్లు (ఐదేళ్లకు రూ.75వేల కోట్లు) ఇస్తామన్నారు. కార్పొరేషన్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. తెలంగాణలో 32 కులాలను బీసీ జాబితా నుంచి తీసేశారని జగన్ అన్నారు. హరికృష్ణ శవం పక్కన పెట్టుకుని కేటీఆర్‌తో పొత్తులు మాట్లాడొచ్చు కానీ బీసీ జాబితా నుంచి తొలగించిన 32కులాల గురించి మాట్లాడరు అని సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాగానే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో తాను మాట్లాడతానని, 32కులాలను బీసీ జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తానని జగన్ వాగ్దానం చేశారు.