రంగంలోకి పవన్ కల్యాణ్.. ఉత్తరాంధ్ర నుంచి జనసేన ఎన్నికల శంఖారావం
సభ ఏర్పాట్లపై రేపు అనకాపల్లిలో పార్టీ నేతల సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సభలోనే మాజీమంత్రి కొణతాల రామకృష్ణ జనసేన కండువా కప్పుకోనున్నారు.

Pawan Kalyan Election Campaign
Pawan Kalyan : జనసేన పార్టీ కూడా ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఫిబ్రవరి 4న అనకాపల్లిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభను ప్లాన్ చేశారు.
ఆ తర్వాత అమలాపురం, మచిలీపట్నం, తెనాలిలో బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. బహిరంగ సభల షెడ్యూల్ ను నాదెండ్ల మనోహర్ విడుదల చేయనున్నారు. సభ ఏర్పాట్లపై రేపు అనకాపల్లిలో పార్టీ నేతల సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సభలోనే మాజీమంత్రి కొణతాల రామకృష్ణ జనసేన కండువా కప్పుకోనున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు జనసేన సమరశంఖం పూరించనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో పవన్ కల్యాణ్ బహిరంగ సభలు ప్రారంభించబోతున్నారు. ఫిబ్రవరి 4న భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీమంత్రి కొణతాల రామకృష్ణ పవన్ సమక్షంలో జనసేనలో చేరబోతున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 9 లేదా 10న అమలాపురంలోనూ భారీ బహిరంగ సభ ఉంటుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
Also Read : రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఉత్కంఠ.. మహిళ సహా ముగ్గురు పోటీ
ఆ తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ ఉండబోతోంది. అక్కడ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి ఆధ్వర్యంలో లక్షలాది మంది ఒక సభ జరబోతున్నారు. అదే రోజు బాలశౌరి అధికారికంగా జనసేన కండువా కప్పుకోబోతున్నారు. నాదెండ్ల మనోహర్ సొంత నియోజకవర్గం తెనాలిలో ఒక బహిరంగ సభ జరపాలని నిర్ణయించింది జనసేన.
ఎన్నికలకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేశారు పవన్ కల్యాణ్. ఆ కమిటీలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటనలకు సంబంధించి మొత్తం వ్యవహారాలను నాదెండ్ల మనోహర్ చూస్తున్నారు. మొదటి దఫాలో ఈ నాలుగు సభలు ఉంటాయి. తర్వాత రాష్ట్రవ్యాప్త పర్యటనలు ఉంటాయి. ఈ మధ్యలోనే చంద్రబాబు, పవన్ కలిసి ఫిబ్రవరి రెండో వారంలో భారీ బహిరంగ ఏర్పాటు చేయబోతున్నారు.
ఆ సభలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయాలని జనసేన నిర్ణయించుకుంది. ఈలోపే అభ్యర్థుల వ్యవహారానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ ఇదివరకే చంద్రబాబును ఒకసారి కలిశారు. వీలైనంత తొందరలోనే మరో దఫా కలుస్తారు. ఇక ఢిల్లీ కూడా వెళ్లనున్నారు. బీజేపీ విషయంపైనా ఒక క్లారిటీ రానుంది.
Also Read : పొత్తు ధర్మంలో బలైపోయే నేతలు ఎవరు? ఈ 18 సీట్లపై ఇరుపార్టీల్లోనూ గందరగోళం