పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఆలస్యం.. కారణం ఏంటంటే

రెండు రోజుల విశాఖ పర్యటన కోసం ఈ సాయంత్రం 4.30 గంటలకు పవన్ కల్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సి ఉంది.

పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఆలస్యం.. కారణం ఏంటంటే

Pawan Kalyan

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఆలస్యం కానుంది. రెండు రోజుల విశాఖ పర్యటన కోసం ఈ సాయంత్రం 4.30 గంటలకు పవన్ కల్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. కానీ, పవన్ రావాల్సిన స్పెషల్ ఫ్లైట్ మరో రెండు గంటలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మిలాన్ రిహార్సల్స్ జరుగుతున్నందు వల్ల పవన్ స్పెషల్ ఫ్లయిట్ కు నేవీ అధికారుల నుండి క్లియరెన్స్ రాకపోవడమే పవన్ పర్యటన ఆలస్యానికి కారణంగా సమాచారం.

Also Read : ఈ నియోజకవర్గం టీడీపీకి అచ్చిరావడం లేదా? ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించనుంది?

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన ఖరారైంది. ఈ నెల 20, 21 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. కాళ్ల మండలం పెదామిదంలోని నిర్మల ఫంక్షన్ హాల్ లో సమావేశాలు నిర్వహించనున్నారు. జనసేన, టీడీపీ నేతలతో భేటీ కానున్న పవన్.. వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 14న భీమవరంలో పవన్ పర్యటించాల్సి ఉండగా.. హెలిప్యాడ్ కు అధికారులు అనుమతి నిరాకరించడంతో పర్యటన వాయిదా పడింది. కాస్మోపాలిటిన్ క్లబ్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జనసేన నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Also Read : దెబ్బకు రెండు పిట్టలు.. జగన్ మాస్టర్ స్ట్రోక్.. సింగిల్‌ లిస్ట్‌తో మూడు నియోజకవర్గాల సమస్యకు చెక్‌..!