Jaya Prakash Narayana: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు దారితప్పితే ఖబడ్డార్: జయప్రకాశ్ నారాయణ హెచ్చరిక
ఆంద్రప్రదేశ్ లో కొన్ని రాజకీయ పార్టీల ధోరణి సరిగ్గా లేదని, పార్టీలు దారితప్పితే ఖబడ్డార్ అని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ హెచ్చరించారు. విజయవాడలో లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ... రామ, రావణ యుద్ధం జరుగుతున్నట్లు పరిస్థితులు ఉండడం మంచిది కాదని చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత అధికార పార్టీదేనని అన్నారు. ఒకప్పుడు తమిళనాడులో ఉన్న పరిస్థితి ఇప్పుడు ఎపీలో నెలకొందని చెప్పారు.

Jaya Prakash Narayana: ఆంద్రప్రదేశ్ లో కొన్ని రాజకీయ పార్టీల ధోరణి సరిగ్గా లేదని, పార్టీలు దారితప్పితే ఖబడ్డార్ అని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ హెచ్చరించారు. విజయవాడలో లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ… రామ, రావణ యుద్ధం జరుగుతున్నట్లు పరిస్థితులు ఉండడం మంచిది కాదని చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత అధికార పార్టీదేనని అన్నారు. ఒకప్పుడు తమిళనాడులో ఉన్న పరిస్థితి ఇప్పుడు ఎపీలో నెలకొందని చెప్పారు.
రాజకీయాల్లో హుందగా నడుచుకోవాలని జయప్రకాశ్ నారాయణ అన్నారు. తాము చెప్పిందే వేదం అనే ధోరణి దేశంలో ప్రబలిపోతుండటం బాధాకరమని చెప్పారు. ప్రజల హక్కుల్ని కాపాడగలిగే పరిస్థితి, రాష్ట్రంలో, దేశంలో లేదని అన్నారు. చట్టం పాలించాలి కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పాలించకూడదని చెప్పారు. తెలుగు నాట రాజకీయం తీరు మారాలని అన్నారు. యువత పట్టించుకుని రాజకీయాన్ని మార్చాలని చెప్పుకొచ్చారు. రాచరికంలా చేయవద్దని, ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని అన్నారు.
ప్రభుత్వాలు అప్పులు ఇంతలా చేయడం సరైంది కాదని, కూర్చుని తింటే కొండలే తరగిపోతాయని జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. ఎడా పెడా అప్పులు చేస్తే మన పరిస్థితి శ్రీలంకలా మారిపోతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం వంకతో అభివృద్ధిని విస్మరించవద్దని అన్నారు. పేదరికాన్ని తొలగించి వారికాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమల స్థాపనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అవకాశాలు ఉన్నప్పటికీ పరిశ్రమలను తేవడం లేదని అన్నారు.
పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని అన్నారు. అప్పుచేసి పప్పుకూడటం సరైన పద్ధతి కాదని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పణంగా పెట్టి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేయవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు. ముందుచూపు లేకుండా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు వ్యవహరించడం సరైెంది కాదని అన్నారు. పార్టీలు దారితప్పితే ఖబడ్డార్ అని హెచ్చరిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు పెరిగాయని ప్రభుత్వం చెబుతోన్న మాటలు అబద్ధమని అన్నారు.
తాను ఇంగ్లీషుకు వ్యతిరేకం కాదని.. కానీ, పిల్లలకు సులువుగా అర్థమయ్యే మాతృభాషలో బోధన చేయాలనేదే తన విధానమని చెప్పారు. ఫ్యామిలీ కాన్సెప్ట్ లో ప్రభుత్వ వైద్యుడు గ్రామాల్లో తిరుగుతూ వైద్యం చేయాలనే ప్రతిపాదన విజయవంతం కాదని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లో గ్రామాల్లో పేరొందిన ప్రైవేటు డాక్టర్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. అమరావతి రాజధానిపై జయప్రకాశ్ నారాయణ స్పందిస్తూ… ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మంచి విజ్ఞత ప్రదర్శిస్తే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు. ఆర్థిక అభివృద్ధిలో వెనుకబడితే కన్నీళ్లు కారుస్తూనే ఉండిపోవాల్సి వస్తుందని అన్నారు. అందరూ కలసి గతంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించారని చెప్పారు.
రైతులకు, ప్రజలకు, ప్రభుత్వానికి అభివృద్ది ఫలాలు అందేలా గతంలో భూములు సేకరించారని అన్నారు. అమరావతిని అభివృద్ధి చేయడం వల్ల ఆస్తుల విలువలు పెరుగుతాయి కాబట్టే రైతులు ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చారని తెలిపారు. తుగ్లక్ కూడా తరచూ రాజధానులను మార్చారని, రాజధానులను మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం తికమక చేసిందని, ఎక్కడా స్పష్టత లేదని చెప్పారు. రాజధాని అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి అమలు చేయాలని అన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ది చేయాలని చెప్పారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, దాని తీరు మారాల్సిన అవసరం ఉందని అన్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..