TDP : టీడీపీలో చేరికల జోష్.. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు

వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు అట్లా చిన వెంకట రెడ్డి, ఆయన అనుచరులు చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు.

TDP : టీడీపీలో చేరికల జోష్.. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు

Joinings Josh In TDP

Updated On : February 15, 2024 / 8:10 PM IST

TDP : టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి నూజివీడు, చింతలపూడి, సూళ్లూరుపేట, పి.గన్నవరం ఆశావహులు, వారి అనుచరులు భారీగా చేరుకున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరాక నూజివీడు నుంచి పోటీ చేయించాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. పార్థసారథి ఎంట్రీతో నూజివీడు టీడీపీలో రాజకీయం వేడెక్కింది. నూజివీడు టీడీపీ ఇంఛార్జ్ ముద్రబోయిన పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు నూజివీడులో పార్థసారథి ఫ్లెక్సీలను ముద్రబోయిన అనుచరులు చించేశారు. దీంతో టీడీపీ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ముద్రబోయినను టీడీపీ అగ్రనాయకత్వం పిలిపించింది. ముద్రబోయినను బుజ్జగించే పనిలో పడ్డారు చంద్రబాబు. అటు, వచ్చే ఎన్నికల్లో చింతలపూడి టిక్కెట్ మాల సామాజికవర్గానికే ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు ఇంటికి భారీగా కార్యకర్తలు ర్యాలీగా చేరుకున్నారు. ఇక సూళ్లూరుపేట టిక్కెట్ నెలవల సుబ్రమణ్యానికే ఇవ్వాలని ఆయన అనుచరలు పార్టీ పెద్దలను డిమాండ్ చేస్తున్నారు.

Also Read : 4 దశాబ్దాల చరిత్రలో తొలిసారి.. రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ నిష్క్రమణ..

అటు చంద్రబాబు ఇంటి వద్ద చేరికల సందడి నెలకొంది. వివిధ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆళ్లగడ్డ, కోవూరు, కదిరి, నరసరావుపేట, అద్దంకి నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు చంద్రబాబు ఇంటికి వచ్చారు. చంద్రబాబు నివాసానికి గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, వాసు, కందికుంట ప్రసాద్, భూమా అఖిలప్రియ తదితరులు చేరుకున్నారు.

టీడీపీలో చేరేందుకు పల్నాడు నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. అద్దంకి వైసీపీ నేత బాచిన ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీలో చేరింది. బాచిన గరటయ్య, కృష్ణ చైతన్యలకు పార్టీ కండువా కప్పారు చంద్రబాబు. వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు అట్లా చిన వెంకట రెడ్డి, ఆయన అనుచరులు చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు. అట్లా చిన వెంకట రెడ్డి చేరిక నరసరావుపేట నియోజకవర్గంలో కీలకం కానుంది. బాచిన, అట్లా చిన వెంకట రెడ్డి చేరికల కార్యక్రమానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, యరపతినేని, జీవీ ఆంజనేయులు తదితరులు హాజరయ్యారు. ఆళ్లగడ్డ, కోవూరు, కదిరి సెగ్మెంట్లకు చెందిన వైసీపీ నేతలు సైతం టీడీపీలో చేరారు.

Also Read : ఏపీని షేక్ చేస్తున్న నెల్లూరు పెద్దారెడ్ల పొలిటికల్ ఇష్యూస్