జగన్ ను సీఎం చేయడానికే పార్టీలోకి వచ్చా : కిల్లి కృపారాణి

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 07:38 AM IST
జగన్ ను సీఎం చేయడానికే పార్టీలోకి వచ్చా : కిల్లి కృపారాణి

హైదరాబాద్ : కాంగ్రెస్ కు కేంద్ర మాజీ మంత్రి కల్లి కృపారాణి దంపతులు గుడ్ బై చెప్పారు. పార్టీ పదవులకు కిల్లి కృపారాణి, కిల్లి రామ్మోహన్ రావు రాజీనామా చేశారు. ఈమేరకు కిల్లి దంపతులు రాహుల్ కు రాజీనామా లేఖలు మెయిల్ ద్వారా పంపారు. వైఎస్సార్ లోకి కిల్లి కృపారాణి వెళ్లనున్నారు. 

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ ను కిల్లి కృపారాణి కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో ఫిబ్రవరి 28న వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతానని చెప్పారు. జగన్ ను సీఎం చేయడానికే వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. వైసీపీలో చేరాక అయ్యాక అన్ని విషయాలు చెప్తానని తెలిపారు. ధర్మాన ప్రసాదరావు తనతో కలిసి పని చేస్తారని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై విమర్శలు చేశారు కృపారాణి. చంద్రబాబు బీసీలను వాడుకొని వదిలేస్తారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట మార్చారని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తును తీవ్రంగా వ్యతిరేకించానని పేర్కొన్నారు. 
 

Read Also : కేసీఆర్ తో కలిసి జగన్ కుట్రలు : చంద్రబాబు

Read Also : మోడీ మీటింగ్ కు మా క్యాంపస్ ఇవ్వం : ఆంధ్రా వర్శిటీ