హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది చంద్రబాబే: టీడీపీలో చేరిన కిషోర్ చంద్రదేవ్
అమరావతి: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో నేతల పార్టీ మార్పులు జోరుగా సాగుతున్నాయి. మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు.

అమరావతి: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో నేతల పార్టీ మార్పులు జోరుగా సాగుతున్నాయి. మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు.
అమరావతి: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో నేతల పార్టీ మార్పులు జోరుగా సాగుతున్నాయి. మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదివారం(ఫిబ్రవరి 24) ఉదయం ఉండవల్లిలోని ప్రజావేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ జెండా కప్పుకున్నారు. కిషోర్‌తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు కూడా టీడీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన కిశోర్ చంద్రదేవ్.. కురుపాం రాజవంశీయుడు. ఐదుసార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచారు. యూపీఏ-2 హయాంలో మన్మోహన్ కేబినెట్‌లో కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.
కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా ఉందని… అందుకే పార్టీ మార్పు కోరుకున్నానని చంద్రదేవ్ చెప్పారు. కేంద్రంలో బీజేపీని గద్దెదించాల్సిన సమయం ఆసన్నమైందని… అందుకు టీడీపీ సరైన వేదిక అని నిర్ణయించుకున్నానని తెలిపారు. విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజుతో కలిసి పనిచేస్తానని చంద్రదేవ్ స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీకి మరో ప్రత్యామ్నాయం లేదని, అందుకే తాను టీడీపీలో చేరానని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చ జరగలేదని… చంద్రబాబు కోరితే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని ప్రకటించారు. లోక్‌సభ స్థానానికి కిశోర్ చంద్రదేవ్ పోటీచేసే అవకాశమున్నట్లు సమాచారం.
చంద్రబాబుది డెవలప్ మెంట్ ఓరియెంటెడ్ మైండ్ అని కిషోర్ చంద్రదేవ్ కితాబిచ్చారు. ప్రపంచపటంలో హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు అని ప్రశంసించారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి నడుం కట్టారని కిషోర్ అన్నారు. టీడీపీతో పని చేయడం తనకు కొత్త కాదన్నారు. నేషనల్ ఫ్రంట్ లో కలిసి పని చేశామన్నారు. అభివృద్ధి కోసం చంద్రబాబు పరితపిస్తారని కిషోర్ చెప్పారు.