పరేడ్ గ్రౌండ్‌లో Kite And Sweet Festival

పతంగుల పండుగకు వచ్చామా.. గాలిపటాలు ఎగరేశామా.. వెళ్లిపోయామా అనట్లు కాకుండా ఈ సారి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కాస్త కొత్తగా జరగనుంది. 2016 నుంచి టూరిజం అండ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు పతంగుల పండుగ జరగనుంది. ఈ ఫెస్టివల్‌ను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించబోతున్నారు.
ఇప్పటికే తెలంగాణ కైట్ ఫెస్టివల్ అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది.. ఇక ఈ సంవత్సరం నిర్వహించే కైట్ ఫెస్టివల్ కు మరో ప్రత్యేకత ఉంది. అమెరికా, సింగపూర్, ఇండోనేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక, వంటి 25 దేశాల నుంచి దాదాపు 100 మంది కైట్ ప్లేయర్లతో పాటు.. దేశంలో25 రాష్ట్రాలకు చెందిన 60 మంది జాతీయ స్థాయి కైట్ ప్లేయర్లు ఫెస్టివల్ లో పాల్గొనున్నారు. ఈ ఫెస్టివల్ లో 30కి పైగా కైట్ క్లబ్ లు పాల్గొంటున్నాయి. వీరంతా తమ భారీ పతంగుల్ని ఎగరేసి కనువిందు చేయనున్నారు.
ఈ ఫెస్టివల్‌లో నోరూరించే స్వీట్లు కూడా ఉండబోతున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు స్వయంగా ఇంట్లో తయారు చేసిన స్వీట్లను ఇక్కడ ప్రదర్శించనున్నారు.న సుమారు 1000 రకాల స్వీట్లు ఉండనున్నాయి. ఈ ఫెస్టివల్స్‌కు 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.
Read More : మగవారి పొంగళ్ల వేడుక..ఆలయంలోకి మహిళలకు నో ఎంట్రీ