వైసీపీలో చేరిన మాగుంట

  • Published By: venkaiahnaidu ,Published On : March 16, 2019 / 03:39 PM IST
వైసీపీలో చేరిన మాగుంట

టీడీపీ సీనియర్ నాయకుడు,ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనువాసులు రెడ్డి శనివారం(మార్చి-16,2019) వైసీపీలో చేశారు.వైసీపీ అధినేత జగన్ మాగుంటకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాగుంట వెంట చీరాల ఎమ్మెల్యే ఆమంచి కూడా ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను వీడి మాగుంట టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలో ఎమ్మెల్సీ అయ్యారు. అయితే కార్యకర్తల అభీష్ఠం మేరకు తాను టీడీపీని వీడి వైసీపీలో చేరబోతున్నట్లు రెండు రోజుల క్రితం ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట బరిలోకి దిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.