మలక్ పేట ట్రాఫిక్ SI బూతుపురాణం..వీడియో వైరల్

  • Published By: madhu ,Published On : March 12, 2020 / 09:13 AM IST
మలక్ పేట ట్రాఫిక్ SI బూతుపురాణం..వీడియో వైరల్

Updated On : March 12, 2020 / 9:13 AM IST

మద్యం తాగి బైక్ నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే ఏం చేస్తారు..? ఎవ్వరైనా ముందుగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు. తాగినట్టు రుజువైతే ఫైన్ చేస్తారు. లేదంటే కోర్టుకి పంపిస్తారు. కానీ హైదరాబాద్‌ మలక్‌పేట్ ట్రాఫిక్ ఎస్సై షా హుస్సేన్ మాత్రం అవేవీ చేయడు. ముందు నోటికి పనిచెబుతాడు. తాను చెప్పింది వింటే సరి. లేదంటే బూతు పురాణం అందుకుంటాడు. తాగిన మాటేమో గానీ ఎస్సై వాలకం చూసి మద్యం బాబులు అవాక్కవుతున్నారు. 

See Also | విజయ్‌ని వదలట్లేదుగా.. మళ్లీ రంగంలోకి దిగిన ఐటీ..

తనిఖీల్లో పట్టుబడ్డ ఓ మద్యంబాబును మలక్‌పేట్ ట్రాఫిక్ పీఎస్‌కు తీసుకెళ్లారు. అక్కడ టెస్ట్‌లు చేసే క్రమంలో హుస్సేన్‌ ఓవరాక్షన్ చేశాడు. ఎందుకు తాగావ్‌.. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. పోలీస్ అయి ఉండి ఇలా మాట్లాడడంతో అక్కడున్న వాళ్లంతా షాకయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. మలక్‌ పేట్‌ ఎస్సై షా హుస్సేన్‌కి ఇది కొత్తేం కాదని.. గతంలోనూ ఇలాగే వ్యవహరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ నోటా ఈనోటా ఈ మ్యాటర్‌ కాస్త పై అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో విచారణకు ఆదేశించారట. ఎస్సై వ్యవహరించిన తీరుపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 

Read More :coronavirus : కోళ్లు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ