Mayawati: కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటు అనంతరం కాంగ్రెస్ పార్టీపై మాయావతి విమర్శలు

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో దళిత, మైనారిటీలకు స్థానం లభించలేదు కానీ.. కొత్తగా ఎనిమిది మంది సభ్యులతో ఏర్పాటైన మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యమే ఇచ్చారు. ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు మైనారిటీ(ఒకరు ముస్లిం, ఒకరు క్రైస్తవ) అవకాశం కల్పించారు.

Mayawati: కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటు అనంతరం కాంగ్రెస్ పార్టీపై మాయావతి విమర్శలు

Mayawati

Updated On : May 20, 2023 / 3:33 PM IST

Karnataka Politcis: కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటు అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఏ ఒక్కటీ దళితులకు, మైనారిటీలకు ఇవ్వలేదని.. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు వర్గాల ఓట్లతోనే గెలిచిందనే విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కులతత్వం మనస్తత్వం ఇక్కడే తెలిసిపోతోందని, వీరితో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

Rahul Gandhi: గంటలలోనే హామీలు చట్టాలు అవుతాయి.. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటు అనంతరం రాహుల్ గాంధీ

శనివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా మాయావతి స్సందిస్తూ ‘‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంతర్గత కలహాలను అణిచివేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించింది. అయితే డీకే శివకుమార్‌ను మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిని చేసింది. దళితులను ముస్లింలను ఉపేక్షించింది. నిజానికి ఈ రెండు వర్గాలు ఓట్లతోనే కాంగ్రెస్‌ పార్టీకి అధికారం దక్కింది. కర్ణాటకలో సీఎం పదవి కోసం దళిత సంఘాలు లేవనెత్తిన వాదనను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించింది. ఇప్పుడు వర్గాల వారిని డిప్యూటీ సీఎంగా తీసుకోలేదు. ఇది కాంగ్రెస్ కులతత్వ మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఈ వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి’’ అని మాయావతి ట్వీట్ చేశారు.

Supreme Court: ఢిల్లీలో అధికారంపై సుప్రీం తీర్పును సమర్ధించిన సీపీఐ నారాయణ

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో దళిత, మైనారిటీలకు స్థానం లభించలేదు కానీ.. కొత్తగా ఎనిమిది మంది సభ్యులతో ఏర్పాటైన మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యమే ఇచ్చారు. ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు మైనారిటీ(ఒకరు ముస్లిం, ఒకరు క్రైస్తవ) అవకాశం కల్పించారు. ఇక ఇందులో ఒక ఎస్టీ ఉన్నారు. జి. పరమేశ్వర్ (ఎస్సీ), కేహెచ్ మునియప్ప (ఎస్సీ), కేజే జార్జ్ (మైనార్టీ – క్రిస్టియన్), ఎంబీ పాటిల్ (లింగాయత్), సతీష్ జార్కిహోళి (ఎస్టీ – వాల్మీకి), ప్రియాంక్ ఖర్గే (ఎస్సీ), రామలింగారెడ్డి (రెడ్డి), బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ (మైనార్టీ -ముస్లీం)లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.