నాలుగు బిల్డింగ్ లు తప్ప రాజధానిలో ఏముంది?

చంద్రబాబు పర్యటనతో తమకు సంబంధం లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నాలుగు బిల్డింగ్ లు తప్ప రాజధానిలో ఏముందని ప్రశ్నించారు.

  • Published By: veegamteam ,Published On : November 28, 2019 / 12:41 PM IST
నాలుగు బిల్డింగ్ లు తప్ప రాజధానిలో ఏముంది?

Updated On : November 28, 2019 / 12:41 PM IST

చంద్రబాబు పర్యటనతో తమకు సంబంధం లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నాలుగు బిల్డింగ్ లు తప్ప రాజధానిలో ఏముందని ప్రశ్నించారు.

చంద్రబాబు పర్యటనతో తమకు సంబంధం లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం(నవంబర్ 28, 2019) విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాజధానిపై తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. పచ్చటి పొలాలను స్మశానంగా మార్చారని అన్నారు. లక్ష కోట్లపైగా అంచనా వేసి కేవలం రూ.4 వేల కోట్ల పనులు చేశారని విమర్శించారు. నాలుగు బిల్డింగ్ లు తప్ప రాజధానిలో ఏముందని ప్రశ్నించారు. సీఎం జగన్ కు ఒక విధానం ఉంది…ఆ విధానంతోనే ముందుకెళ్తున్నామని చెప్పారు.

ఏపీ రాజధాని అంశంతోపాటు చంద్రబాబు అమరావతి పర్యటనపై సోమవారం మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. బాబు పర్యటనపై విమర్శలు చేసిన బొత్స.. రాజధాని స్మశానాన్ని చూసి ఏడవడానికి వస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రాజధానిలో ఏమీ చేయకుండా.. ఇప్పుడు ఎందుకు వస్తున్నారన్న అర్థంలోనే తాను ఆ పదం ఉపయోగించానని మంత్రి తన వ్యాఖ్యలపై వాదన వినిపించారు.

బొత్స సత్యనారాయణ అమరావతిపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మంత్రి రాజధానిని స్మశానంతో పోల్చారంటూ టీడీపీ ఆరోపిస్తుంటే.. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని మంత్రి అంటున్నారు. చంద్రబాబు రాజధాని పర్యటనను ఉద్ధేశించి తాను అలా వ్యాఖ్యానించానే తప్ప.. మరో ఉద్ధేశం లేదంటున్నారు.