Munugode By Poll : మునుగోడు ఉప ఎన్నిక వెనుక రూ.22వేల కోట్ల కుంభకోణం ఉంది : మంత్రి సంచలన వ్యాఖ్యలు

మునుగోడు ఉప ఎన్నికలపై మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక వెనుక రూ.22 వేల కోట్ల కుంభకోణం ఉంది అంటూ అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Munugode By Poll : మునుగోడు ఉప ఎన్నిక వెనుక రూ.22వేల కోట్ల కుంభకోణం ఉంది : మంత్రి సంచలన వ్యాఖ్యలు

Jagdish Reddy

Updated On : August 19, 2022 / 1:50 PM IST

Munugode By Poll : మునుగోడు ఉప ఎన్నికలపై మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మునుగోడు ఉప ఎన్నిక వెనుక రూ.22 వేల కోట్ల కుంభకోణం ఉంది అంటూ అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కుటుంబం స్వార్థం కోసం..వారి వ్యాపార అభివృద్ధి కోసం మునుగోడుకు ఉప ఎన్నిక తీసుకొచ్చారు అంటూ పరోక్షంగా కోమటిరెడ్డి కుటుంబంపై విమర్శలు సంధించారు మంత్రి జగదీశ్ రెడ్డి. మునుగోడులో గెలుపు కోసం ఏ పార్టీ ఎన్ని యత్నాలు చేసిన గెలుపు సాధించేది మాత్రం టీఆర్ఎస్ అంటూ ధీమా వ్యక్తం చేశారు మంత్రి. అసంతృప్తులతో టీఆర్ఎస్ కు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు జగదీశ్ రెడ్డి.

టీఆర్ఎస్ లో అసంతృప్తులు పెరుగుతున్నారని వారంతా బీజేపీలో చేరతారు అంటూ బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలను ఉద్ధేశించి మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక మునుగోడులో గెలుపు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపీలో ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. పోటీ పోటీగా సభలు నిర్వహించి తమ సత్తాను చాటుకోనున్నారు. ఇక ఈ ఉప ఎన్నికలో పోటీ చేయాలా? లేదా వేరే ఏ పార్టీకైనా మద్దతు ఇవ్వాలా? అనే డైలామాలో ఉన్నారు కమ్యూనిస్టులు. ఈక్రమంలో తమతో కమ్యూనిస్టులు కలిసి వస్తే కలుపుకుపోవటానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది అంటూ మంత్రి జగదీశ్ రెడ్డి కమ్యూనిస్టులకు హింట్ ఇచ్చారు. మునుగోడుకు ఉప ఎన్నికల రావటానికి కారణాలు ఏమిటో రేపు టీఆర్ఎస్ మునుగోడులో నిర్వహించే సభలో సీఎం కేసీఆర్ చెబుతారు అని తెలిపారు మంత్రి జగదీశ్ రెడ్డి.