సిరిసిల్లకు రైలు తీసుకొస్తా : మంత్రి కేటీఆర్ వరాల జల్లు

సిరిసిల్ల ప్రజలపై మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 12:06 PM IST
సిరిసిల్లకు రైలు తీసుకొస్తా : మంత్రి కేటీఆర్ వరాల జల్లు

Updated On : January 18, 2020 / 12:06 PM IST

సిరిసిల్ల ప్రజలపై మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

సిరిసిల్ల ప్రజలపై మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలోనే సిరిసిల్లను అగ్రశ్రేణి పట్టణంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (జనవరి 18, 2020) సిరిసిల్లలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని, మాట్లాడుతూ సిరిసిల్ల ప్రజల రైలు ఆకాంక్ష నేరవేరనుందన్నారు. రాబోయే రెండేళ్లలో సిరిసిల్లకు రైలు తీసుకొచ్చే బాధ్యత తనదన్నారు. జెఎన్ టీయూ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

75 గజాల స్థలంలో ఎటువంటి అనుమతి లేకుండా ఇల్లు కట్టుకోవచ్చన్నారు. 75 గజాల కంటే ఎక్కువ ఉంటే 21 రోజుల్లో అనుమతి ఇస్తామని చెప్పారు. అర్హులైన పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత తనదన్నారు. మీకు గుర్తింపు ఇచ్చే బాధ్యత తనదని తెలిపారు. తెలంగాణలోని పట్టణాలంన్నింటిలో భారతదేశం ఆశ్చర్యపోయేలా అభివృద్ధి చేస్తానని చెప్పారు.

రెబల్స్ కు కేటీఆర్ చురకులు అంటించారు. గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులు పనిచేయకుంటే వారిని తీసేస్తామనిచెప్పారు. జనవరి 22న ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు. 39 వార్డుల్లో 4 ఏకగ్రీవం అయ్యాయయని…35 స్థానాల్లో ఎన్నికలు కానున్నాయని చెప్పారు. 35 స్థానాల్లో ఒక్క కూడా పొల్లు పోకుండా సద్ది కట్టి మాకు దీవెన ఇయ్యండన్నారు. మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.