గన్నవరం నుంచి హెలికాఫ్టర్‌లో గుంటూరుకు మోడీ

గన్నవరం నుంచి హెలికాఫ్టర్‌లో గుంటూరుకు మోడీ

Updated On : February 10, 2019 / 5:39 AM IST

ప్రధానమంత్రి నరేంద్రమోడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ విమానాశ్రయమైన గన్నవరానికి చేరుకున్న ఆయన హెలికాఫ్టర్‌లో గుంటూరు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, డీజీపీ ఠాకూర్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, పలువురు అధికారులు, అనధికారులు ప్రధానికి స్వాగతం పలికారు.

విజయవాడ, గుంటూరులలో మోడీకి వ్యతిరేకంగా వామపక్షాల నిరసనలు వెల్లువెత్తాయి. కొన్ని చోట్ల టీడీపీ నేతలు నల్ల జెండాలతో ఆందోళనకు దిగారు. సభకు ఏ మాత్రం ఇబ్బంది వాటిల్లినా ఊరుకునేది లేదని బీజేపీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.