ముహూర్తం ఫిక్స్ : వైసీపీని ఓడించటమే లక్ష్యం.. వంగవీటి రాధా 

  • Published By: chvmurthy ,Published On : March 12, 2019 / 08:14 AM IST
ముహూర్తం ఫిక్స్ : వైసీపీని ఓడించటమే లక్ష్యం.. వంగవీటి రాధా 

విజయవాడ: వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరటానికి ముహూర్తం ఖారారైంది. సోమవారం అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో కలిసి సీఎం చంద్రబాబు  నివాసంలో భేటీ  అయిన రాధాకృష్ణ తాను ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని చంద్రబాబుకే వదిలేశారు. ఈ ఎన్నికల్లో తాను ప్రచారం చేయటానకి సిధ్దంగా ఉన్నానని చంద్రబాబుకు చెప్పారు. చంద్రబాబుతో జరిగిన సమావేశంలో వైసీపీలో తనకు జరిగిన అవమానాలను రాధా వివరించినట్లు తెలిసింది.
Read Also : వైసీపీ మమ్మల్ని నిలువునా ముంచేసింది : తిప్పారెడ్డి భార్య

ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడిచటమే ధ్యేయంగా రాష్ట్రమంతా పర్యటిస్తానని   రాధా వెల్లడించారు. కొన్నినియోజకవర్గాల నుంచి పోటీ చేసే విషయంపై వంగవీటి రాధ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ పోటీ విషయాన్ని చంద్రబాబు నిర్ణయానికి వదిలేశారు.  బుధవారం సాయంత్రం రాధాకృష్ణ టీడీపీ తీర్ధం పుచ్చకోనున్నారు.  గడచిన  5 ఏళ్లలో  రాష్ట్రంలో కాపులకు చేసిన సంక్షేమ పధకాల విషయాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. 
Read Also : బాపట్ల వైసీపీలో విభేదాలు : కోన v/s చీరాల గోవర్థన్ రెడ్డి