నో ఈవీఎం..ఓన్లీ బ్యాలెట్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు

  • Published By: madhu ,Published On : December 24, 2019 / 10:19 AM IST
నో ఈవీఎం..ఓన్లీ బ్యాలెట్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు

Updated On : December 24, 2019 / 10:19 AM IST

నూతనంగా ఏర్పాటైన 07 కార్పొరేషన్లకు, 63 మున్సిపాలిటీలకు తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 10 కార్పొరేషన్లలో కరీంనగర్‌, నిజామాబాద్‌, రామగుండం మినహా.. బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌, బండ్లగూడ జాగీర్‌, బోడుప్పల్‌, పీర్జాదిగూడ, జవహర్‌నగర్‌, నిజాంపేట కార్పొరేషన్లకు తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి.

 

63 మున్సిపాలిటీల్లో తొలి పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. మున్సిపల్‌ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలోనే జరుగనుండటంతో బ్యాలెట్‌ పత్రాలను జిల్లాల వారీగానే ముద్రించుకోవాలని TSEC ఆదేశించింది. పార్టీ పరంగా జరిగే ఎన్నికలు కావడం, స్వతంత్రులు కూడా బరిలో ఉంటుండటంతో.. అభ్యర్థుల ప్రకటన తర్వాత బ్యాలెట్‌ పత్రాలను స్థానికంగానే ముద్రించుకోవాలని సూచించింది.

 

ఇందుకోసం ఇప్పటికే ముద్రణా సంస్థలను ఖరారు చేసినట్టు అధికారులు వివరించారు. ఒక బ్యాలెట్‌ పేపర్‌లో ఎనిమిది గుర్తులతో పాటు నోటా ఉంటుంది. అవి దాటితే మరో పేపర్‌లో ముద్రిస్తారు. గతంలో నిర్వహించిన ఎన్నికలను పరిశీలించి 10 నుంచి 20 శాతం అదనంగా బ్యాలెట్లను ముద్రించనున్నారు.

* 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. 
* 2020, జనవరి 07వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్.
* 2020, జనవరి 11న నామినేషన్ల పరిశీలన.
* 2020, జనవరి 10 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు.

* 2020, జనవరి 11న నామినేషన్ల పరిశీలన.
* 2020, జనవరి 14వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. 
* 2020, జనవరి 22న పోలింగ్.
 

* 2020, జనవరి 25న కౌంటింగ్.
* 2020, జనవరి 24 (రీ పోలింగ్ వస్తే)

Read More : TS మున్సి పోల్స్ : ప్రచారం 6 రోజులు మాత్రమే