Ongole Flexies : సీఎం జగన్ ఫొటో మిస్సింగ్.. ఒంగోలు వైసీపీలో ఫ్లెక్సీల కలకలం
Ongole Flexies : సీఎం జగన్, మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫొటోలు కనిపించలేదు. ఫ్లెక్సీలలో బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి, జిల్లా అధికారుల ఫొటోలను మాత్రమే ఉంచారు.

Balineni Srinivas Reddy
Ongole Flexies : ఒంగోలులో వైసీపీ పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. చలివేంద్రాల వద్ద మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే, అందులో సీఎం జగన్, మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫొటోలు కనిపించలేదు. ఫ్లెక్సీలలో బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి, జిల్లా అధికారుల ఫొటోలను మాత్రమే ఉంచారు.
Also Read..Gone Prakash Rao : ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు పక్కా.. లేకపోతే 100 సీట్లు
అయితే, చలివేంద్రాల ప్రారంభోత్సవంలో బాలినేని పాల్గొనలేదు. బాలినేని రాకపోవడంతో అధికారులే చలివేంద్రాలను ప్రారంభించారు. నగర కార్పొరేటర్లు బాలినేనికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విషయాన్ని గ్రహించి ఈరోజు సీఎం జగన్, మంత్రి సురేశ్ ఫొటోలతో ఫ్లెక్సీలను తిరిగి ఏర్పాటు చేశారు.