Mayawati: మాయావతి లేకుంటే విపక్షాలు ఏమీ చేయలేవు.. మరింత డోస్ పెంచిన ఓం ప్రకాష్ రాజ్‌భర్
బ్రాహ్మణ, బనియా ప్రధానమంత్రులు పోయారని, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఓబీసీలకు కూడా ప్రధాని పదవి దక్కినట్టైందని, ఇప్పుడు సమయం దళితులదని, మాయావతిని ప్రధానిగా ప్రకటించి, ఆమెకు మద్దతుగా విపక్షాలు నిలబడాలని ఆయన కొద్ది రోజుల క్రితం అన్నారు

Om Prakash Rajbhar: వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్న సమయంలో.. సుహేల్దేవ్ భారతీయ్ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ మరొక ప్రతిపాదన చేస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఒప్పించాలంటూ ఆయన పలుమార్లు డిమాండ్ చేశారు. విపక్షాల కూటమిలోకి బీఎస్పీని తీసుకుని, మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని అంటున్నారు. అయితే ఈ విషయమై ఆయన తాజాగా స్వరం పెంచారు.
Dhulipalla Narendra : ఏ కేసుల మాఫీ కోసం జగన్ ఏపీకి అమూల్ ని తీసుకువచ్చారు : ధూళిపాళ్ల
మాయావతిని కలవకుండా, ఆమెను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఒప్పించకుండా విపక్షాలు ఎంత ఏకమైనా ఏమీ చేయలేవని అన్నారు. మాయావతి సమర్థవంతమైన పాలకురాలని, ఆమె పార్టీకి 13 రాష్ట్రాల్లో పట్టు ఉందని, దేశంలోనే అతిపెద్ద ముఖమని అన్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీలో గెలవకుండా దేశంలో అధికారంలో ఉన్నవారిని ఓడించలేమని ఆయన చెప్పారు. అది జరగాలంటే మాయావతో సంప్రదింపులు జరపాలని అన్నారు.
Kishan Reddy: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి.. మరి బండి సంజయ్ ఎక్కడికి?
‘‘బీఎస్పీ చీఫ్ మాయావతి సమర్థవంతమైన పాలకురాలు. ఆమె పార్టీకి 13 ప్రావిన్స్‌లలో మాస్ బేస్ ఉంది. ఆమె దేశంలో పెద్ద ముఖం. ప్రతిపక్షాలు మాయావతిని ప్రధాని ముఖంగా భావించి ఒప్పించాలి. మమతా బెనర్జీ, కేసీఆర్, లాలూ యాదవ్ లాంటి నేతలు ఎవరు ఇక్కడికి (ఉత్తరప్రదేశ్) వచ్చినా.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. రాష్ట్రం మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జయంత్ చౌదరి, తూర్పున ఓం ప్రకాష్ రాజ్‌భర్ ఉంటారు. మొత్తంగా బహుజన సమాజ్ పార్టీ ఉంటుంది. ఈ మూడూ లేనిదే విపక్షాల ఐక్యత ఇక్కడ పనికిరాదు’’ అని రాజ్‌భర్ అన్నారు.
Bandi Sanjay: బండి సంజయ్ ఔట్.. ఎక్కడ తేడా కొట్టింది.. కిషన్ రెడ్డి ముందున్న సవాళ్లు ఏంటి?
పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశానికి ముందు నుంచి మాయావతి, బీఎస్పీ గురించి రాజ్‌భర్ చాలా సందర్భాల్లో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. బ్రాహ్మణ, బనియా ప్రధానమంత్రులు పోయారని, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఓబీసీలకు కూడా ప్రధాని పదవి దక్కినట్టైందని, ఇప్పుడు సమయం దళితులదని, మాయావతిని ప్రధానిగా ప్రకటించి, ఆమెకు మద్దతుగా విపక్షాలు నిలబడాలని ఆయన కొద్ది రోజుల క్రితం అన్నారు. ఇప్పుడైతే మాయావతి లేకుండా విపక్షాలు ఏమీ చేయలేవని తేల్చి చెప్తున్నారు.