ప్రభుత్వానికి హెచ్చరిక : రాజధానిని తరలిస్తే ఆమరణ నిరాహార దీక్ష
ఏపీ రాజధాని వ్యవహారం దుమారం రేపుతోంది. రాజధానిని అమరావతి నుంచి షిఫ్ట్ చేస్తారనే వార్తలు రాజకీయాలను వేడెక్కించాయి. ప్రకాశం జిల్లా దొనకొండని రాష్ట్ర రాజధానిగా

ఏపీ రాజధాని వ్యవహారం దుమారం రేపుతోంది. రాజధానిని అమరావతి నుంచి షిఫ్ట్ చేస్తారనే వార్తలు రాజకీయాలను వేడెక్కించాయి. ప్రకాశం జిల్లా దొనకొండని రాష్ట్ర రాజధానిగా
ఏపీ రాజధాని వ్యవహారం దుమారం రేపుతోంది. రాజధానిని అమరావతి నుంచి షిఫ్ట్ చేస్తారనే వార్తలు రాజకీయాలను వేడెక్కించాయి. ప్రకాశం జిల్లా దొనకొండని రాష్ట్ర రాజధానిగా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ నేతలు ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదంటున్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. రాజధానిపై జగన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతి సేఫ్ ప్లేస్ కాదన్న మంత్రి బొత్స వ్యాఖ్యలపై పరిటాల సునీత మండిపడ్డారు. అవి బొత్స వ్యాఖ్యలు కాదన్నారు. బొత్సలోని జగన్ అంతరాత్మ ఆ విధంగా మాట్లాడుతోందని విమర్శించారు.
ప్రభుత్వం ప్రకటించిన పథకాలపైనా పరిటాల సునీత విమర్శలు చేశారు. అమ్మఒడి పథకంపై ఇప్పటివరకు స్పష్టత లేదన్నారు. రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ సక్రమంగా జరగడం లేదన్నారు. పించన్లు అందక అంతా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. సీఎం జగన్ ఇచ్చిన మాటను తప్పారని పరిటాల సునీత అన్నారు.