జనసేన అభ్యర్ధుల ఎంపిక : నాగబాబు ఎంట్రీ

జనసేన అధినేత పనవ్ కళ్యాణ్ కు మద్దతుగా ఆయన సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. ఎన్నికలు సమీపించటంతో తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక..ప్రకటించే విషయంలో తమ్ముడికి తోడుగా నాగబాబు ఎంట్రీ ఇచ్చారు.

  • Published By: veegamteam ,Published On : March 11, 2019 / 09:05 AM IST
జనసేన అభ్యర్ధుల ఎంపిక : నాగబాబు ఎంట్రీ

Updated On : March 11, 2019 / 9:05 AM IST

జనసేన అధినేత పనవ్ కళ్యాణ్ కు మద్దతుగా ఆయన సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. ఎన్నికలు సమీపించటంతో తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక..ప్రకటించే విషయంలో తమ్ముడికి తోడుగా నాగబాబు ఎంట్రీ ఇచ్చారు.

విజయవాడ : జనసేన అధినేత పనవ్ కళ్యాణ్ కు మద్దతుగా ఆయన సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. ఎన్నికలు సమీపించటంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో తమ్ముడికి తోడుగా నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. ఎలక్షన్ డేట్ ఫిక్స్ అవ్వటంతో పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఎన్నికల యుద్ధానికి సిద్ధం అయ్యాయి. జనసేన పార్టీ అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు చేస్తోంది.

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో పవన్ సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరుపుతున్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో క్యాడర్ ను సిద్దం చేస్తున్నారు పవన్. ఇప్పటి వరకు పవన్ కుటుంబం నుంచి ఎవరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. పవన్ ఒక్కరే చూసుకుంటున్నారు.

పార్టీ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియలో నాగబాబు ఎంట్రీతో పార్టీలో జోష్ పెరిగిందని జనసైనికులు అంటున్నారు. మార్చి 14న రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. ఈ సభలోనే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.