ఓట్లు కొనకుండానే ఎన్నికల్లో గెలవొచ్చని ఆప్ నిరూపించింది
జగన్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు చేశారు. వైసీపీ.. డబ్బుతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. డబ్బుతో ఓట్లు కొన్నవారు ప్రజా సమస్యలు

జగన్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు చేశారు. వైసీపీ.. డబ్బుతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. డబ్బుతో ఓట్లు కొన్నవారు ప్రజా సమస్యలు
జగన్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు చేశారు. వైసీపీ.. డబ్బుతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. డబ్బుతో ఓట్లు కొన్నవారు ప్రజా సమస్యలు పరిష్కరించరని పవన్ చెప్పారు. జనసేన మాత్రం అందుకు విరుద్దం అన్నారు. ధన రాజకీయాలకు జనసేన దూరం అని చెప్పారు. జనసేన.. ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తుందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ సభలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలపై తన అభిప్రాయం చెప్పారు. క్రిమినల్ పాలిటిక్స్ కు వ్యతిరేకంగా పోరాడాలి, డబ్బు ప్రభావంతో నడిచే రాజకీయ వ్యవస్థను తరిమి కొట్టాలన్నదే జనసేన లక్ష్యం అన్నారు.
నేను డిగ్రీ చదవకపోయినా.. సమాజాన్ని నిత్యం చదువుతూనే ఉంటానని పవన్ చెప్పారు. సినిమాలు నాకు సమాజం పట్ల బాధ్యత ఇచ్చాయన్నారు. ఆ బాధ్యత కారణంగానే మళ్లీ సినిమాలు చేస్తున్నానని పవన్ వివరించారు. ఇతర రాజకీయ నాయకుల్లా నేను కాంట్రాక్టులు చేయడం లేదన్నారు. జగన్ రెడ్డిలాగా నాకు మైన్స్ లేవన్నారు. గ్రంథి శ్రీనివాస్ లా.. రొయ్యల వ్యాపారం, కోల్డ్ స్టోరేజీలు లేవన్నారు.
డబ్బులున్నవారే రాజకీయాలు చేయాలనే భావన ప్రస్తుతం సమాజంలో ఉందన్నారు. అలాంటి భావన పోవాలని పవన్ ఆకాంక్షించారు. డబ్బు లేని మధ్య తరగతి మనిషి కూడా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి రావాలన్నారు. అదే జనసేన సిద్ధాంత కూడా అని పవన్ చెప్పారు. రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఎన్నికల్లో గెలిచే పరిస్థితి రావాలన్నారు. డబ్బు ఖర్చు పెట్టకుండానే రాజకీయాలు చేయొచ్చని, ఎన్నికల్లో గెలవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ నిరూపించిందని పవన్ అన్నారు. ఆప్ వాళ్లు డబ్బుతో ఓట్లు కొనలేదని చెప్పారు. డబ్బు ఖర్చు పెట్టకుండానే జనసేన మిత్రపక్షం బీజేపీపై ఆప్ గెలిచిందని పవన్ వ్యాఖ్యానించారు. అనేక విధాలుగా ప్రభావితం చేసే వ్యక్తులతో పోరాడి మరీ ఆప్ గెలిచిందన్నారు.
అభివృద్ది వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు పెట్టడం కాదన్నారు పవన్. ప్రతి గ్రామంలో సర్పంచ్ కింద నిధులు ఉండగలితే.. అదే నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ అని పవన్ అన్నారు. అలాంటి విధానం కేరళ రాష్ట్రంలో జరుగుతోందన్నారు.