Kolusu Parthasarathy : టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే.. అందుకేనట..

నూజివీడులో అందరినీ కలుపుకుని పోతూ టీడీపీ విజయానికి కృషి చేస్తానన్నారు పార్థసారథి

Kolusu Parthasarathy : టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే.. అందుకేనట..

Updated On : February 26, 2024 / 5:41 PM IST

Kolusu Parthasarathy : పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పార్థసారథి టీడీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్నారు. నూజివీడు టీడీపీ అభ్యర్థిగా కొలుసు పార్థసారథిని ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు విజన్ భావితరాలకు ఎంతో అవసరం అన్నారు పార్థసారథి.

నూజివీడులో అందరినీ కలుపుకుని పోతూ టీడీపీ విజయానికి కృషి చేస్తానన్నారు పార్థసారథి. ”రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ-జనసేన ప్రభుత్వం రావాలని చంద్రబాబు, పవన్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం మారాలని భావిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తూ మేమంతా టీడీపీలో చేరాము” అని పార్థసారథి వెల్లడించారు.

Also Read : ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..