Rajasthan: కాంగ్రెస్ పార్టీ మీద సచిన్ పైలట్ తిరుగుబాటుపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు

ఇద్దరు నేతల గొడవను రాష్ట్ర గొడవగా మార్చి ప్రజలను గందరగోళంలోకి నెట్టారని, పెద్ద ఎత్తున అవినీతిలోకి రాష్ట్రాన్ని నెట్టారని అమిత్ షా విమర్శించారు. రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని, కాంగ్రెస్ పార్టీ డ్రామాలను, వంచనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గెహ్లాట్‌ను సవాలు చేయడంలో సచిన్ పైలట్ విఫలమయ్యారని అమిత్ షా ఎద్దేవా చేశారు.

Rajasthan: కాంగ్రెస్ పార్టీ మీద సచిన్ పైలట్ తిరుగుబాటుపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు

Amit Shah

Updated On : April 15, 2023 / 9:35 PM IST

Rajasthan: సొంత ప్రభుత్వం మీదే తిరుగుబాటు చేస్తున్న రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత సచిన్ పైలట్‭ను ‘ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు’ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. శనివారం ఆయన రాజస్థాన్ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాల్లో కూరుకుపోయిందని, వారికి ప్రజల గురించి ఏమాత్రం పట్టింపు లేదని అన్నారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం “విఫల ప్రయోగం” అని అమిత్ షా విమర్శించారు.

TSPSC: నియామక పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. రీ-షెడ్యూల్డ్ తేదీలు ఇవిగో..

రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే అవినీతికి పాల్పడ్డారని అయితే ఆ అవినీతిపై గెహ్లాట్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై సచిన్ పైలట్ ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. వాస్తవానికి ఇది బీజేపీకి వ్యతిరేకంగా కనిపించినప్పటికీ.. ఇద్దరు నేతలకు ఎంత మాత్రం పడట్లేదని, గెహ్లాట్ మీద కోపంతోనే చేసినట్లు బహిరంగ చర్చే జరుగుతోంది. దీనిని పరోక్షంగా లేవెనత్తి అమిత్ షా.. “పైలట్ ఏ సాకుతోనైనా ధర్నాకు చేయగలరు. కానీ అతని వంతు (ముఖ్యమంత్రి కావడం) రావడం చాలా కష్టం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖజానాను నింపడంలో సచిన్ సహకారం తక్కువ. గెహ్లాట్ బాగా సహకారిస్తారు’’ అని షా అన్నారు.

Telangana elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ

ఇద్దరు నేతల గొడవను రాష్ట్ర గొడవగా మార్చి ప్రజలను గందరగోళంలోకి నెట్టారని, పెద్ద ఎత్తున అవినీతిలోకి రాష్ట్రాన్ని నెట్టారని అమిత్ షా విమర్శించారు. రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని, కాంగ్రెస్ పార్టీ డ్రామాలను, వంచనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గెహ్లాట్‌ను సవాలు చేయడంలో సచిన్ పైలట్ విఫలమయ్యారని అమిత్ షా ఎద్దేవా చేశారు. క్షేత్ర స్థాయిలో ఆదరణ ఉన్నప్పటికీ సీఎం కుర్చీ మాత్రం పైలట్‭కు దక్కదని అమిత్ షా అన్నారు.

Pulwama Attack: మౌనంగా ఉండమని మోదీ చెప్పారట.. పుల్వామా దాడిపై జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

పైలట్‌కు చెందిన గుజ్జర్ కమ్యూనిటీ ఆధిపత్యం తూర్పు రాజస్థాన్‌లో ఎక్కువగా ఉంటుంది. ఇదే ప్రాంతంలో శనివారం అమిత్ షా పర్యటించారు. తూర్పు రాజస్థాన్ ప్రాంతంలో గుజ్జర్లు శక్తివంతమైన, ప్రభావవంతమైన కుల సమూహం. రాజకీయ ప్రాతినిధ్యం, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు వంటి విషయాల్లో తరుచుగా ఉద్యమిస్తుంటారు. గత ఎన్నికల్లో గుజ్జర్ సామాజికవర్గానికి బీజేపీ 9 టిక్కెట్లు ఇచ్చింది. అయితే రాజస్థాన్ తొలి గుజ్జర్ ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ అవుతాడన్న ఆశతో గుజ్జర్ల ఓట్లు మొత్తానికి మొత్తంగా కాంగ్రెస్ వైపుకు మళ్లాయి. దీంతో బీజేపీ నిలబెట్టిన గుజ్జర్ నేతలంతా పరాభవం అయ్యారు.