ఎన్నికల సిబ్బందికి ప్రత్తిపాటి భార్య వార్నింగ్

ఎన్నికల సిబ్బందికి ప్రత్తిపాటి భార్య వార్నింగ్

Updated On : April 11, 2019 / 9:07 AM IST

2019 ఎన్నికలు సజావుగా ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. నేతలే పోలింగ్ కేంద్రాలకు వచ్చి బెదిరింపులకు దిగుతున్నారు. ఎన్నికల సిబ్బందిని బెదిరించి తమకు అనుకూలంగా ఓట్లు వేయాలని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య రెచ్చిపోయారు. 

పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులంతా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ హెచ్చరించారు. ఉద్యోగుల వైపు వేలు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఎన్నికల సిబ్బంది అసహనానికి లోనైయ్యారు. బాధ్యత గల నేత భార్య ఇలా ప్రవర్తించడం సరికాదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.