Maharashtra Politics: మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టారా?.. శివసేన, ఎన్సీపీ చీలింది అందుకేనా?
మరాఠా పార్టీలైన శివసేన, ఎన్సీపీలు సహాయ పార్టీలుగానే మిగిలిపోతున్నాయి. వాస్తవానికి మహారాష్ట్రలో తమ ఆధిపత్యం కోసం శివసేన, ఎన్సీపీలు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించడం లేదు. అయితే తాజా పరిస్థితులు మాత్రం వారికి సరిగ్గా కలిసొచ్చాయని అంటున్నారు

Maha Political Game: గత ఏడాది జూన్ నెలలో శివసేన పార్టీ చీలిపోయింది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే కూటమిలో చేరారు. అనంతరం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం షిండే ముఖ్యమంత్రి కావడం విధితమే. సరిగ్గా ఏడాది గడవగానే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కూడా అదే జరిగింది. కొంత మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. ఈసారి కూడా దాదాపుగా అలాగే జరిగింది. అజిత్ పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు బీజేపీ, శివసేనలతో సమానంగా మంత్రి పదవులు తీసుకుంది.
Chandrayaan-3: భారతీయుల ఆశల్ని నింగిలోకి మోసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్.. చంద్రయాన్-3 సక్సెస్!
ఇక్కడ విచిత్రం ఏంటంటే.. 40 సీట్లు ఉన్న షిండే వర్గానికి ముఖ్యమంత్రి పదవితో పాటు ఎనిమిది మందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇక కేవలం 30 స్థానాలే ఉన్న అజిత్ పవార్ వర్గానికి ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంత్రి పదవులు ఇచ్చారు. కానీ 105 స్థానాలున్న బీజేపీకి కూడా ఒక ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంది మంత్రులు కేటాయింపులు అయ్యాయి. ప్రభుత్వపరంగా చూసుకుంటే ఇది భారతీయ జనతా పార్టీకి పెద్ద నష్టం. ఈ విషయమై బీజేపీ నేతల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఏడాది వ్యవధిలో శివసేన, ఎన్సీపీ చీలిపోవడం పట్ల చాలా ప్రశ్నలు వస్తున్నాయి. చీలిక అనుకోకుండా జరిగిందా? ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే ప్రశ్నలు సహజంగానే వస్తుందని అంటున్నారు. అయితే ఎలా జరిగిందనేది పక్కన పెడితే.. ఇది ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని బీజేపీ, శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం) ప్రకటించాయి. ఇక ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) ఈ విషయాన్ని స్పష్టం చేయనప్పటికీ.. దాని వైఖరి కూడా ఇలాగే ఉంటే అది బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు.
మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే.. బీజేపీ మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. సీట్ల పంపకాల నుంచే ఈ ప్రభావం ఉంటుంది. పోటీ చేసే స్థానాలే పెద్ద ఎత్తున తగ్గుతాయి. ఇక గెలిచే సీట్లైతే మరీ తక్కువ అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఒకసారి గత రెండు అసెంబ్లీ ఎన్నికలను కనుక పరిశీలించినట్లైతే.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన ఒంటరిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో ఎన్సీపీ, కాంగ్రెస్ కూడా విడిగా పోటీ చేశాయి. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ, శివసేన పార్టీలు రెండు పార్టీలు భారీగా లాభపడ్డాయి. బీజేపీ ఏకంగా 122 సీట్లు గెలుచుకోగా శివసేన 63 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 76 సీట్లు అధికంగా గెలిచింది. శివసేన 19 స్థానాలను పెంచుకుంది.
ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసి పోటీ చేశాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో.. 2014 నాటి ఎన్నికల్లో బీజేపీ 260 స్థానాల్లో పోటీ చేయగా, శివసేన 282 స్థానాల్లో పోటీ చేసింది. అయితే 2019 నాటి ఎన్నికల్లో బీజేపీ 152 స్థానాల్లో పోటీ చేయగా, శివసేన 124 స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఇద్దరికీ స్థానాలు తగ్గాయి. బీజేపీకి 17 స్థానాలు తగ్గి 105 సీట్లకు పరిమితం కాగా, శివసేన 7 స్థానాలు కోల్పోయి 56 స్థానాలు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కూడా కలిసి పోటీ చేసి కొంత లాభపడ్డాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఎన్సీపీ 13 స్థానాలు ఎక్కువ గెలుచుకోగా, కాంగ్రెస్ రెండు స్థానాలను పెంచుకుంది.
Moldova: ఎయిర్‌పోర్ట్‌లో కాల్పుల్లో ఇద్దరి మరణం అనంతరం రాజీనామా చేసిన ముగ్గురు మంత్రులు
ఈ రెండు ఎన్నికల నుంచి ఒక వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. కలిసి పోటీ చేసినప్పటికీ కంటే ఒంటరిగా పోటీ చేసినప్పుడే బీజేపీ ఎక్కువ లాభపడింది. అటుఇటుగా సగం స్థానాల వరకు గెలుచుకోగలిగింది. బీజేపీ బలాన్ని తగ్గించాలంటే పోటీ సమయంలోనే పోటీ చేసే స్థానాలను తగ్గించాలి. శివసేన, ఎన్సీపీ వల్ల అదే జరిగినట్టు కనిపిస్తోంది. రెండు పార్టీలు కలిసి సగం స్థానాలనైనా తీసుకుంటాయి. దీంతో బీజేపీ కేవలం సగం స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. బహుశా.. ఇది కూడా తగ్గే అవకాశం లేకపోలేదు. ఈ లెక్కన చూసుకుంటే.. ఇక గెలిచే స్థానాల సంఖ్య ఎంతకు తగ్గుతుందో అన్నది ఊహించుకోవచ్చు.
అయితే ఈ పరిమాణాలు కేవలం బీజేపీకి మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా చేదు ఫలితాల్నే ఇవ్వబోతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్.. 2019 ఎన్నికల్లో నాలుగో స్థానానికి పడిపోయింది. చాలా కాలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పేరు పెద్దగా వినిపించడం లేదు. ఇక ప్రస్తుతం అయితే శివసేన, ఎన్సీపీల గురించే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికలు కూడా శివసేన, ఎన్సీపీ పార్టీల ప్రత్యర్థుల పోటీగా మారనుంది. ఇందులో బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చర్చకు వచ్చే అవకాశం లేదు. పోటీ శివసేన, ఎన్సీపీ వర్సెస్ శివసేన, ఎన్సీపీలాగ ఉండనుంది.
Sheela Bhatt on PM Modi: ఎంఏ చదువుతుండగా మోదీని కలిశానన్న జర్నలిస్ట్.. మరోసారి చర్చలో మోదీ డిగ్రీ
ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గాలు అటు బీజేపీతో కలిసి పోటీకి దిగే అవకాశం ఉంది. ఇటు ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ వర్గాలు కాంగ్రెస్ పార్టీతో పోటీకి దిగనున్నాయి. రెండు కూటముల్లో కలిపి ఎక్కువ సీట్లలో ఈ రెండు పార్టీలే పోటీలో ఉంటాయి. రాజకీయ గాలి ఎటువైపు తిరిగినా ఎటొచ్చీ లాభపడేది శివసేన, ఎన్సీపీలే. ఇందులో నష్టపోయేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అసెంబ్లీలో సగానికి పైగా స్థానాలు ఉన్నాయి. కానీ, ఈ కూటముల వల్ల ఈసారి సగం స్థానాల్లోనే ఈ రెండు పార్టీలు పోటీకి దిగే అవకాశం ఉంది.
Maharashtra Politics: పంతం నెగ్గించుకున్న అజిత్ పవార్.. పట్టుబట్టి మరీ ఆర్థిక శాఖ తీసుకున్నారు
ఇక వచ్చే ఎన్నికల రాజకీయం అంతా.. ఉద్ధవ్ థాకరే వర్సెస్ ఏక్నాథ్ షిండే, శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్ మధ్య విద్రోహం, తిరుగుబాటు మీద నడిచే అవకాశం ఉంది. ఈ ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రేక్షక పాత్రకు పరిమితమైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక మహారాష్ట్ర స్థానిక పార్టీలుగా ఎన్సీపీకి శివసేన పార్టీలకు ఎలాగూ ట్యాగ్ ఉంది. అది కూడా చెలరేగితే కాంగ్రెస్, బీజేపీలు సైడ్ అవ్వాల్సిందే. శివసేన చీలిక సమయంలో చీలిక గురించి కాస్త లైట్ తీసుకున్నప్పటికీ ఎన్సీపీ కూడా అదే తరహాలో చీలడంతో చాలా అనుమానాలు రేకెత్తాయి.
మహారష్ట్రలో ప్రాంతీయ వాదం, మరాఠావాదం బలంగానే ఉన్నప్పటికీ ఎప్పటి నుంచో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలే నిర్ణాయక శక్తిగా కొనసాగుతూ వస్తున్నాయి. మరాఠా పార్టీలైన శివసేన, ఎన్సీపీలు సహాయ పార్టీలుగానే మిగిలిపోతున్నాయి. వాస్తవానికి మహారాష్ట్రలో తమ ఆధిపత్యం కోసం శివసేన, ఎన్సీపీలు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించడం లేదు. అయితే తాజా పరిస్థితులు మాత్రం వారికి సరిగ్గా కలిసొచ్చాయని అంటున్నారు. ఇదంతా మాస్టర్ మైండ్ శరద్ పవార్ గేమని చెబుతున్నవారు లేకపోలేదు.
సీట్ల పంపకాల విషయంలో అంటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీని కార్నర్ చేసి.. ప్రాధాన్యత గల స్థానాలను కనుక శివసేన, ఎన్సీపీల్లోని ఇరు వర్గాలు తీసుకున్నట్లైతే జాతీయ పార్టీల ప్రాధాన్యం తగ్గినట్టే చెప్పవచ్చు. ఉద్దేశపూర్వకంగా చీలికలు వచ్చాయా లేదంటే అనుకోకుండా జరిగిందా అనే విషయంలో వాస్తవాలు ఏంటనే విషయం పక్కన పెడితే.. ఎలా చూసుకున్నా వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో రెండు జాతీయ పార్టీలు తీవ్రంగా నష్టపోతున్నాయనే హెచ్చరికలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.