వెళ్లు.. వెళ్లిపో : ఆ ఎమ్మెల్యే టీడీపీ నుంచి సస్పెండ్

  • Published By: veegamteam ,Published On : January 22, 2019 / 08:49 AM IST
వెళ్లు.. వెళ్లిపో : ఆ ఎమ్మెల్యే టీడీపీ నుంచి సస్పెండ్

Updated On : January 22, 2019 / 8:49 AM IST

ఏపీ రాష్ట్రం కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనతోపాటు అనుచరులను టీడీపీ నుంచి గెంటేసి కలకలం రేపారు చంద్రబాబు. 2019, జనవరి 22వ తేదీ కడప జిల్లా రాజంపేట, జమ్మలమడుగు నియోజకవర్గాల సమావేశంలో పార్టీ నేతల నుంచి కంప్లయింట్స్ రావటంతో.. వెంటనే వేటు వేశారు బాబు.

టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూనే.. ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ నేతలతో తిరుగుతుండటం ఆధారాలతో సహా చంద్రబాబు ఎదుట పెట్టారు నియోజకవర్గనేతలు. దీంతో అమరావతి జరిగే సమావేశానికి రావాలని ఎమ్మెల్యే మేడాను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఆయన రాలేదు. లైట్ తీసుకున్నారు. పార్టీ ఆదేశాలు ధిక్కరించటం, వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న కారణంగా టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సోదరుడు మేడా రఘునాథరెడ్డి తో కలిసి వైసీపీలో చేరేందుకు ఇప్పటికే  రంగం సిద్ధం చేసుకున్నారు ఎమ్మెల్యే. హైదరాబాద్ లో జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరనున్నారు. మేడా వ్యవహారంపై ఎంపీ సీఎం రమేష్ సైతం మండిపడ్డారు. టీడీపీలో చేరినవెంటనే మేడాకు చంద్రబాబు ప్రభుత్వ విప్ పదవిని కట్టబెట్టారనీ..ఆయన తండ్రికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుడిగా నియమించిన విషయాన్ని గుర్తు చేశారు.