సెలూన్లు తెరుచుకుంటున్నాయి

కరోనా వైరస్ కారణంగా గత 56 రోజులగా మూత పడిన సెలూన్ షాపులు మంగళవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో తెరుచుకోనున్నాయి. లాక్ డౌన్ 4 సడలింపుల పై ప్రగతి భవన్ లో సమావేశమైన తెలంగాణ కేబినెట్ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.
కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ… మంగళవారం, మే 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో సిటీ బస్సులను మాత్రం అనుమతించబోమని తేల్చిచెప్పారు. అయితే హైదరాబాద్‌లో ఆటోలు, టాక్సీలకు మాత్రం అనుమతి ఇచ్చారు.
ఇక మే నెల 31 వరకూ హైదరాబాద్ లో మెట్రో రైలు సర్వీసులు నడపబోమన్నారు. ఇతర రాష్ట్రాల బస్సులకు రాష్ట్రంలో అనుమతి లేదన్నారు. అలాగే తెలంగాణా బస్సులు కూడా ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వట్లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.