NCP vs NCP: అజిత్ పవార్‭కు గట్టి వార్నింగ్ ఇచ్చిన శరద్ పవార్

సోమవారం మీడియాతో మాట్లాడుతూ అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్‌పవారేనని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం ఎన్సీపీలోని అజిత్‌పవార్‌ వర్గం నాయకులు ముంబైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు

NCP vs NCP: అజిత్ పవార్‭కు గట్టి వార్నింగ్ ఇచ్చిన శరద్ పవార్

Updated On : July 4, 2023 / 7:32 PM IST

Maharashtra Politics: తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ (Ajit Pawar) వర్గానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ (Sharad pawar) వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ఫ్లెక్సీల్లో తన ఫోటో వాడుకోవడంపై పవార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా తన ఫోటో వాడుకోరాదని మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అజిత్ పవార్ వర్గం ముంబైలో ఎన్‌సీపీ కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోను ఆయన కార్యాలయం షేర్ చేసింది. అందులో శరద్ పవార్ ఫోటో అందులో కనిపించడంతో పవార్ ఘాటుగా స్పందించారు.

Mayawati: మాయావతి లేకుంటే విపక్షాలు ఏమీ చేయలేవు.. మరింత డోస్ పెంచిన ఓం ప్రకాష్ రాజ్‭భర్

ఈ విషయమై పవార్ స్పందిస్తూ ”నా అభిప్రాయాలకు వ్యతిరేకంగా, సైద్ధాంతిక విభేదాలున్న వ్యక్తులు నా ఫోటో వాడుకోవద్దు. అలాంటి వాళ్లు ముందుగా నా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది” అని పరోక్షంగా అజిత్‌ పవార్‭ను ఉద్దేశించి అన్నారు. మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్‌గా సునీల్ తట్కరేని అజిత్ పవార్ ప్రకటించారు. అయితే ఆ స్థానంలో జయంత్ పాటిల్ కొనసాగుతారని శరద్ పవార్ స్పష్టం చేశారు.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు చారిత్రాత్మక రికార్డు.. ఒక్కరోజులో 5 లక్షల 10వేల మంది ప్రయాణం

సోమవారం మీడియాతో మాట్లాడుతూ అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్‌పవారేనని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం ఎన్సీపీలోని అజిత్‌పవార్‌ వర్గం నాయకులు ముంబైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా లోక్‌సభ సభ్యుడు సునీల్‌ తట్కరేను ఎన్నుకున్నట్లు సీనియర్‌ నేత ప్రఫుల్ పటేల్‌ ప్రకటించారు.

USA Multnomah Falls : జలపాతం చూసేందుకు వెళ్లి లోయలో పడి వ్యక్తి మృతి.. భార్య, పిల్లలు చూస్తుండగానే

అదేవిధంగా తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా అజిత్‌పవార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రఫుల్ పటేల్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా సునీల్‌ తట్కరే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే, మరి జాతీయ అధ్యక్షుడు ఎవరని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అందుకు ప్రఫుల్‌ పటేల్‌ కంటే ముందే అజిత్‌ పవార్‌ స్పందిస్తూ ‘మీరు మర్చిపోయారా..? మా పార్టీ జాతీయాధ్యక్షులు శరద్‌పవారే’ అని అన్నారు.