Congress: శశి థరూర్‌ను పూర్తిగా పక్కన పెట్టేస్తోన్న కాంగ్రెస్!
పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడం చూసి, క్యాంపెయిన్ నుంచి తప్పుకుంటున్నట్లు థరూర్ ప్రకటించారు. మొత్తం 40 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, దిగ్విజయ్ సింగ్, భూపేష్ బాఘేల్, కన్హయ్య కుమార్, తదితరులు ఉన్నారు.

Shashi Tharoor opts out of Gujarat campaign
Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పోటీకి దిగిన అనంతరం నాటి నుంచి శశి థరూర్‌కు పార్టీలో అంతర్గత మర్యాద తగ్గుతోంది. మర్యాదే కాదు, ఆయన ప్రాధాన్యతను కూడా కాంగ్రెస్ పార్టీ తగ్గిస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడం. కన్హయ్య కుమార్, అనంత్ పాటిల్, నసీం ఖాన్ లాంటి వాళ్లకు కూడా చోటు కల్పించి థరూర్‌ను మాత్రం ఈ జాబితాలోకి తీసుకోకపోవడంతో ఆయనను పూర్తిగా పక్కన పడేస్తున్నారనే విశ్లేషణలు ఎక్కువయ్యాయి.
వాస్తవానికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గుజరాత్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం శశి థరూర్‌ను ఆహ్వానించింది. అందుకు థరూర్ ఒప్పుకున్నారు. అయితే పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడం చూసి, క్యాంపెయిన్ నుంచి తప్పుకుంటున్నట్లు థరూర్ ప్రకటించారు. మొత్తం 40 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, దిగ్విజయ్ సింగ్, భూపేష్ బాఘేల్, కన్హయ్య కుమార్, తదితరులు ఉన్నారు.
పార్టీలో సీనియర్ నేతల్లో ఒకరైన, దేశ వ్యాప్తంగా పేరు గాంచిన థరూర్ పేరు లేకపోవడం ఉద్దేశపూర్వకంగా ఆయనను పక్కన పెట్టడమే అంటున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానంపై (గాంధీ కుటుంబం) థరూర్ పరోక్ష విమర్శలు చేశారు. పైగా, గాంధీ కుటుంబాన్ని సంప్రదించకుండా ఎన్నికల్లో పోటీకి దిగారు. ప్రచారంలో ఉన్నప్పుడే రాష్ట్రాల పీసీసీల నుంచి ఖర్గేకు వచ్చిన ఆదరణ థరూర్‌కు రాలేదు. పోలింగ్ చివరి నాటికి థరూర్ ఓటమి ఫిక్సైనట్లే అనుకున్నారు. అనుకున్నట్లుగానే భారీ ఓట్లతో ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి థరూర్‌కు ఎదురైన మొదటి చేదు అనుభవం ఇదే.
Ajay Maken: కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు మొదటి ఎదురుదెబ్బ.. రాజస్తాన్ ఇంచార్జి రాజీనామా