జగన్ కు ఓటేస్తే కేటీఆర్ తో కలిసి అక్కడ్నించి పాలిస్తారు:  సోమిరెడ్డి

  • Published By: chvmurthy ,Published On : March 4, 2019 / 02:09 PM IST
జగన్ కు ఓటేస్తే కేటీఆర్ తో కలిసి అక్కడ్నించి పాలిస్తారు:  సోమిరెడ్డి

Updated On : March 4, 2019 / 2:09 PM IST

అమరావతి: వైసీపీకి ఓటేస్తే జగన్, కేటీఆర్ కలిసి హైదరాబాదులో ఉండి ఏపీని పాలిస్తారు అని  ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలకు ఏపీ ప్రజలు, పోలీసులపై నమ్మకం లేదని ఆయన అన్నారు. ఏపీ పోలీసుల హక్కులను తెలంగాణ కాలరాస్తోందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుధ్ధమని  సోమిరెడ్డి మండి పడ్డారు. ఏపీ ప్రభుత్వ డేటా చోరీకి గురైతే  దాన్ని ఏపీ పోలీసులు చూసుకుంటారని కోర్టే చెప్పిందని తెలిపారు.
Also Read : డేటా దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ పరువు తీశారు : లోకేష్

ఆన్ లైన్లో 75 వేల ఓట్లు తొలగించమని వైసీపీ ఫిర్యాదులు చేసిందని, సర్వేపల్లిలోని ఒక్క  మండలంలోనే ఓట్ల తొలగింపు కోసం ధరఖాస్తుల విషయంలో  30కు పైగా కేసులు పెట్టారని సోమిరెడ్డి చెప్పారు. బల్కుగా ఓట్లు తొలగించమని అప్లై చేస్తే కేసులు పెడతారని, దీనితో వైసీపీ క్రిమినల్ మైండ్ బయటపడిందని మంత్రి అన్నారు. సేవామిత్ర  టీడీపీకి చెందిన కార్యక్రమం అని, టీడీపీ కార్యకర్తలకు చేసిన సహాయం మాత్రమే సేవా మిత్ర యాప్ లో పెట్టామని,  పార్టీకి చెందిన పనిని మాత్రమే ఆ ఐటీ సంస్ధకు అప్పగించామని ఆయన తెలిపారు.
Also Read : వీళ్లను మీరు ఎంతకు కొన్నారు: ఉత్తమ్‌కు కేటీఆర్ కౌంటర్