ఎన్టీఆర్ కు అన్యాయం తట్టుకోలేక 15ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నా
ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు మంగళవారం (డిసెంబర్ 10,2019) వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. వల్లభనేని వంశీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే వంశీకి

ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు మంగళవారం (డిసెంబర్ 10,2019) వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. వల్లభనేని వంశీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే వంశీకి
ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు మంగళవారం (డిసెంబర్ 10,2019) వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. వల్లభనేని వంశీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే వంశీకి స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడే అవకాశం ఇవ్వడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ప్రశ్నోత్తరాలను పక్కనపెట్టి మరీ వంశీతో మాట్లాడించడం కరెక్ట్ కాదన్నారు. ఎంతో అత్యవసరం అయితే తప్ప ప్రశ్నోత్తరాలను పక్కనపెట్టరు అని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. కానీ చంద్రబాబుని తిట్టించడానికే వంశీకి అవకాశం ఇచ్చారని అచ్చెన్న వాపోయారు.
టీడీపీ సభ్యుల ఆరోపణలను స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఖండించారు. వంశీ మాట్లాడుతుండగా టీడీపీ నేతలు అడ్డుపడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన విచక్షణాధికారంతోనే వంశీకి మాట్లాడే అవకాశం ఇచ్చానని స్పీకర్ చెప్పారు. వంశీ కూడా ఓ ప్రజాప్రతినిధి అని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై తన అభిప్రాయం చెప్పుకునే వేదిక అసెంబ్లీ అన్నారు. సభలో సభ్యుడి గొంతునొక్కే ప్రయత్నం చేస్తే ఊరుకోనని స్పష్టం చేశారు. అసెంబ్లీని వైసీపీ కార్యాలయంగా మార్చారు అని టీడీపీ అనడం కరెక్ట్ కాదన్న స్పీకర్ తమ్మినేని.. ఆ మాటను టీడీపీ ఉపసంహరించుకోవాలన్నారు. అసెంబ్లీ పవిత్ర దేవాలయం అని చెప్పారు.
అసెంబ్లీ ఎవరి జాగీరు కాదు.. ప్రజల జాగీరు అని స్పీకర్ తేల్చి చెప్పారు. నా పరిమితులు నాకు తెలుసు అని స్పీకర్ చెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీ రామారావు పేరుని ప్రస్తావించారు. ఎన్టీఆర్ వ్యవహారంతో తాను కూడా ఉన్నట్టు చెప్పిన స్పీకర్.. ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయంపై విచారం వ్యక్తం చేశారు. అందుకే తాను 15ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నానని వివరించారు.
అంతకుముందు మాట్లాడిన ఎమ్మెల్యే వంశీ.. తాను సీఎం జగన్ ను కలిస్తే చంద్రబాబుకి ఉలుకెందుకని ప్రశ్నించారు. తాను సీఎంను కలవడం ఇదే మొదటిసారి కాదన్నారు. గతంలో పోలవరం కాలువ భూ సేకరణ సమస్యపై సీఎంతో మాట్లాడానని తెలిపారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానని వివరించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్న బాబుకు భయమెందుకని వంశీ అడిగారు.