చంద్రబాబు ఇల్లు అక్రమమే అయితే కూల్చేయండి : సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు

కృష్ణా నది కరకట్టపై ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఇంటి వివాదంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు

  • Published By: veegamteam ,Published On : September 25, 2019 / 12:00 PM IST
చంద్రబాబు ఇల్లు అక్రమమే అయితే కూల్చేయండి : సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు

Updated On : September 25, 2019 / 12:00 PM IST

కృష్ణా నది కరకట్టపై ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఇంటి వివాదంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు

కృష్ణా నది కరకట్టపై ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఇంటి వివాదంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అద్దెకి ఉంటున్న ఇంటిపై ఇంత రాజకీయం అవసరమా అని సీరియస్ అయ్యారు. అది అక్రమ కట్టడమే అయితే నోటీసులు ఇచ్చి వెంటనే కూల్చేయాలని సుజనా చౌదరి జగన్ ప్రభుత్వానికి సూచించారు. అంతేకానీ ఇంతటి రాజకీయం అవసరం లేదని అన్నారు. 24 గంటలూ చంద్రబాబు ఇంటి గురించే చర్చ ఎందుకు అని ప్రశ్నించారు. చంద్రబాబు సంగతి ఏమో కానీ.. అక్రమంగా కట్టిన ఇంట్లో నేనైతే ఉండను అని సుజనా చౌదరి స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం ఆ ఇల్లుని కూల్చితే సానుభూతి వస్తుందని చంద్రబాబు ఆశిస్తున్నారని సుజనా చౌదరి అన్నారు.

కృష్ణా నది కరకట్టపై ఉన్న ఇంట్లో చంద్రబాబు నివాసం ఉంటున్నారు. ఆ ఇల్లు లింగమనేని రమేష్ ది. అయితే అది అక్రమ కట్టడం అని సీఆర్డీయే అధికారులు తేల్చారు. కూల్చివేత నోటీసులు ఇచ్చారు. లింగమనేని రమేష్ మాత్రం అక్రమ కట్టడం కాదు అంటున్నారు. అనుమతులు తీసుకుని ఇల్లు కట్టామని చెబుతున్నారు. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, చంద్రబాబుని వేధిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం.. నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని చెబుతున్నారు.