Pawan Kalyan(Photo : Google)
Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే తన అజెండా అని, అందుకోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తు ఉంటుందని, తాను సీఎం అభ్యర్థిని కానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పొత్తుల గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. పవన్ వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో కలవరం నింపగా, టీడీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. పవన్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారు.
పొత్తులతో ముందుకెళ్తామన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మల రామానాయుడు చెప్పారు. పవన్ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల్లో భరోసా నింపాయని ఆయన అన్నారు. పవన్ వ్యాఖ్యలతో వైసీపీ ఎర్రిపప్పల ప్యాంట్లు తడుస్తున్నాయన్నారు. భావితరాల భవిష్యత్తు కోసమే చంద్రబాబు-పవన్ ల ఆలోచన అని నిమ్మల రామానాయుడు చెప్పారు. గోదావరి జిల్లాల్లో వైసీపీకి 2 సీట్లకంటే ఎక్కువ రావని ఇప్పటికే బుకీలు పందాలు కాస్తున్నారని చెప్పారు. గోదావరి జిల్లాల్లో 34సీట్లకు 2కంటే ఎక్కువ సీట్లు రావట్లేదంటే వైసీపీ పనైపోయిందన్నది ఆయన కామెంట్ చేశారు.
Also Read..Pawan Kalyan : సీఎం పదవి, పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
జవహర్ మాజీమంత్రి..
జనసేన-టీడీపీ పొత్తులపై ఈరోజు పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. జగన్ లాంటి రాక్షసుడిని ఓడించడానికి అన్ని పార్టీలు కలవాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పవన్ చాలా నిజాయితీగా తన మనసులోని మాటలను ఈరోజు వ్యక్తపరిచారు. ఈ ప్రజాస్వామ్య చరిత్రలో పవన్ లాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. చాలా క్లారిటీగా తన విధానాన్ని స్పష్టం చేశారు. టీడీపీ-జనసేన ఇరు పార్టీల కార్యకర్తలు ఇక నుంచి కలిసి పని చేస్తారు. సీట్ల సర్దుబాటు గురించి మా అధినేత సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు. జగన్ ని ఓడించడానికి సమాజంలోని అన్ని వర్గాలు ఏకం కావాలి.
పొత్తులపై పవన్ క్లారిటీ..
ఏపీలో అప్పుడే ఎన్నికల హడావుడి కపినిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక, పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ తరుణంలో పొత్తుల గురించి జనసేనాని పవన్ హాట్ కామెంట్స్ చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పవన్.. పొత్తులపై దాదాపుగా క్లారిటీ ఇచ్చేశారు.
వైసీపీ నుంచి ఏపీని విముక్తం చేయడమే తమ ప్రధాన అజెండా అని తేల్చి చెప్పిన పవన్.. ఈ దిశగా కలిసివచ్చే పార్టీలతోనే తమ పొత్తు ఉంటుందని వెల్లడించారు. అంతేకాదు, సీఎం పదవిపైనా స్పష్టత ఇచ్చారు పవన్. వచ్చే ఎన్నికల్లో తాను సీఎం అభ్యర్థిని కానని పరోక్షంగా వెల్లడించారు. సీఎం కుర్చీని గట్టిగా అడిగి తీసుకోగల బలం ప్రస్తుతానికి జనసేనకు లేదన్నారు పవన్ కల్యాణ్. వచ్చే ఎన్నికల్లో ఓటు చీలనివ్వనని తేల్చి చెప్పిన పవన్.. ఆ దిశగానే తమ పొత్తులు ఉంటాయన్నారు.