ప్రకాశం టీడీపీలో కలకలం : జగన్ పార్టీలోకి మాగుంట?

ప్రకాశం జిల్లా రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి పార్టీ వీడితే.. ఇప్పుడు మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా షాక్ ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన వర్గీయులు, కార్యకర్తలు, అభిమానులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తాను సూచించిన అభ్యర్థులను మార్చకపోకపోవటం.. టీడీపీ తరపున పోటీ చేస్తే ఓటమి తప్పదని సర్వేలో వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపించనుంది. దీంతో అలర్ట్ అయిన మాగుంట.. వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారంట. 2019, ఫిబ్రవరి 17న చేరేందుకు ఖారారైయినట్లు మాగుంట వర్గీయులు చెబుతున్నారు. అనుచరులతో మాగుంట సమావేశం అయిన సమయంలోనే.. సీఎం కార్యాలయం నుంచి ఆయనకు కాల్ వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. చంద్రబాబుతో అత్యవసరంగా సమావేశం కావాలని ఆ ఫోన్ కాల్ సారాంశం అంట.
గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచిన మాగుంట 2014 ఎన్నిక ల ముందు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మాగుంటకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు కూడా టీడీపీ నుంచి బరిలోకి దిగితే ఓడిపోతాననే భయంతోనే.. జగన్ పార్టీలోకి వెళుతున్నారంట.